అదృష్టమంటే వీరిదే..! ఏడాదిలో లక్షతో రూ.42 లక్షలు సంపాదించారు!

Gita Renewable Energy Stocks Gave 41 30 Percent Returns in 1 Year - Sakshi

సంపాదన పెరిగిన కొద్ది పెట్టుబడులు పెరగాలి అంటారు మన పెద్దలు. అందుకే సామాన్య ప్రజానీకం ఏ భూమి మీదనో, బంగారం మీదనో పొదుపు చేస్తూ ఉంటారు. ఈ రెండూ మంచి పొదుపు మార్గాలే కానీ, ఇవి ఆశించినంత రాబడి ఇవ్వవు. అదే రాబడి ఎక్కువగా వచ్చే స్టాక్ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ అంటే ప్రజలు వెనకడుగు వేస్తారు. సామాన‍్య జనాలు దీనిని ఒక క్లిష్టమైన సబ్జెక్ట్‌ గా పరిగణిస్తారు. ఒక్కసారి గనుక వీటిలో ప్రావీణ్యం సాధించాలే గానీ మీరు ఊహించలేని డబ్బులు వస్తాయి. స్టాక్‌మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ లో మొదటి సారి పెట్టుబడి పెట్టె చాలా తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టాలి. 

తాజాగా గీతా రెన్యువబుల్ ఎనర్జీ షేర్ ధర ఎవరు ఊహించలేనంత రీతిలో పెరిగింది. ఈ బీఎస్ఈ లిస్టెడ్ ఎనర్జీ స్టాక్ ధర ఒక ఏడాదిలో ₹5.52 నుంచి ₹233.50కు పెరిగింది. ఈ ఏడాదిలో కాలంలో సుమారు 4130 శాతం జంప్ అయ్యింది. ఇంకా సులభంగా చెప్పాలంటే మీరు గనుక ఈ గత ఏడాది రూ. 1 లక్ష రూపాయలు విలువ గల షేర్లు కొని ఉంటే మీరు కేవలం ఏడాదిలో ఎటువంటి పనిచేయకున్న రూ.42 లక్షలు సంపాదించేవారు. స్టాక్ మార్కెట్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ లలో పెట్టుబడి పెట్టడం తప్పు కాదు. కానీ,దాని ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెట్టుబడి పెట్టడం ముమ్మాటికి మన తప్పే. అలాంటి వారు మాత్రమే ఎక్కువ సంఖ్యలో నష్ట పోతున్నారు. అలాగే, మీరు పెట్టుబడి పెట్టేముందు కంపెనీ చరిత్ర, భవిష్యత్ తెలుసుకోవడం చాలా మంచిది. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి వీటిలో పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు, నష్టాలు వస్తే బికారీ కూడా అవ్వచ్చు.(చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top