గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్‌లలో ఆ నగరమే టాప్.. | Ganesh Idols and Sweets Sales During This Ganesh Chaturthi | Sakshi
Sakshi News home page

గణేష్ చతుర్థి: భారీగా విగ్రహాల సేల్స్.. స్వీట్స్ ఆర్డర్‌లలో ఆ నగరమే టాప్..

Sep 9 2024 9:54 AM | Updated on Sep 9 2024 10:17 AM

Ganesh Idols and Sweets Sales During This Ganesh Chaturthi

దేశంలో వినాయక చతుర్థి సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ గణేష్ చతుర్థికి.. వినాయక విగ్రహాల విక్రయాలు ఏకంగా 10 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'జెప్టో' గణాంకాల ప్రకారం.. వినాయక విగ్రహాలు మాత్రమే కాకుండా రెడీమేడ్ మోదకాలు గంటకు 1500 అమ్ముడైనట్లు.. మోదకాల అచ్చులు కూడా గంటకు 500 అమ్ముడయ్యాయని సమాచారం. ప్రధాన నగరాల్లో ఎక్కువ స్వీట్ ఆర్డర్స్ పొందిన నగరంగా బెంగళూరు రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత స్థానాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఉన్నాయి.

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న జెప్టో.. భారతదేశం అంతటా 10,000 పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహాలను విక్రయించింది. వంద శాతం పర్యావరణ అనుకూల విగ్రహాలను అందించడానికి జెప్టో 100 మందికిపైగా స్థానిక కళాకారులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.

ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్    

గత 24 గంటల్లోనే జెప్టో 70,000కు పైగా స్వీట్లను విక్రయించింది. మోదకాలు అమ్మకాలలో ముంబై ముందంజలో ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్‌లలో లడ్డూల ఎక్కువగా అమ్ముడైనట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే.. మోదకాలు అమ్మకాలు ఐదు రెట్లు, లడ్డూల విక్రయాలు 2.5 రెట్లు, మిఠాయిలు అమ్మకాలు రెండు రెట్లు, పూజా సామాగ్రి రెండు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement