అందరికీ ఎండాకాలం, మాకిదే మంచి కాలమంటున్న ఆ కంపెనీలు.. ఎందుకంటే?

Fmcg dairy firms betting on sales growth in summer - Sakshi

వేసవి కాలం మొదలైపోయింది.. భానుడి వేడి రోజు రోజుకి పెరుగుతోంది. ఈ తరుణంలో ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాల డిమాండ్ ఎక్కువవుతోంది. కావున అమ్మకాలు మునుపటికంటే దాదాపు రెండు రెట్లు పెరిగే అవకాశం ఉందని ఎఫ్‌ఎమ్‌సిజి అండ్ డెయిరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు.

దాదాపు రెండు సంవత్సరాల తరువాత కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో కంపెనీల అమ్మకాలు మరింత వృద్ధి చెందే సూచనలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సీజన్‌లో తమ ఉత్పత్తులకు డిమాండ్‌ని పెంచుకోవడానికి తగిన ఆఫర్స్ కూడా తీసుకురానున్నట్లు సమాచారం.

పాలు, పాల పానీయాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్‌ల విక్రయదారులలో ఒకటైన మదర్ డైరీ ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అంచనా వేస్తూ ఉత్పత్తులను వేగవంతం చేయడానికి, రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ కొనసాగటానికి తగిన విధంగా సిద్ధమవుతోంది. కోల్డ్-చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిఫర్ వెహికల్స్, షెల్ఫ్ స్ట్రెంగ్త్‌ నిర్ధారించడానికి కన్స్యూమర్ టచ్ పాయింట్‌లలో అసెట్ డిప్లాయ్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టామని మదర్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ బండ్లీష్ తెలిపారు.

 

మదర్ డెయిరీ ఈ సమ్మర్ సీజన్‌లో మరో 15 కొత్త ఉత్పత్తులు లేదా రుచులను ప్రారంభించడం ద్వారా వినియోగదారులను ఆకర్శించడానికి సిద్ధంగా ఉంది. రాబోయే సీజన్‌లో ఐస్‌క్రీం వర్గం దాదాపు 25 శాతం వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు కూడా బండ్లీష్ చెప్పుకొచ్చారు.

శీతల పానీయాల తయారీ సంస్థ పెప్సికో వేసవి ప్రారంభంమే చాలా ఉత్సాహంగా ఉందని, 2023 పానీయాల రంగానికి తప్పకుండా కలిసొస్తుందని ఆశాభావాలను వ్యక్తం చేసింది. అంతే కాకుండా స్వదేశీ ఎఫ్‌ఎమ్‌సిజి మేజర్ డాబర్ ఇండియా తన వేసవి ఉత్పత్తులు తప్పకుండా ఆశాజనకంగా అమ్ముడవుతాయని ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top