Holi Sale 2023: Flipkart hefty discounts on iPhone 13, iPhone 14 - Sakshi
Sakshi News home page

ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్‌!..మరీ ఇంత డిస్కౌంటా?

Mar 3 2023 9:04 AM | Updated on Mar 3 2023 1:29 PM

Flipkart Hefty Discounts On Iphone13 And Iphone14  - Sakshi

హోలీ సందర్భంగా కొనసాగుతున్న బిగ్‌ బచత్‌ ధమాల్‌ సేల్‌లో ఐఫోన్‌ 13,ఐఫోన్‌ 14 ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్స్‌ ప్రకటించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సేల్‌లో దాదాపు 1000 కి పైగా బ్రాండ్స్‌కి చెందిన దాదాపు లక్షకుపైగా ప్రోడక్ట్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 

వీటితో పాటు పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌లైన ఐఫోన్‌ 13,ఐఫోన్‌ 14 మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్‌లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా ఐఫోన్‌ 13 ధర రూ.61,999 ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఫోన్‌పై ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ సౌకర్యం ఉంటే ఆ ధర కాస్త  రూ.23,000 వరకు తగ్గుతుంది. 

అదే సమయంలో ఐఫోన్‌ 14 ధర రూ.71,999 ఉండగా..సేల్‌లో రూ.67,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా గృహోపకరణాలు, వంటగదిలో వినియోగించే వస్తువులు,హోమ్‌ అప్లయెన్సెస్‌ పై 70శాతం, రిఫ్రిజిరేటర్లపై 60శాతం డిస్కౌంట్స్‌, ల్యాప్‌ట్యాప్స్‌పై 45శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement