తొమ్మిది బ్యాంకులకు ఫిచ్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ అప్‌గ్రేడ్‌ | Fitch Agency Upgraded 9 Banks Rating | Sakshi
Sakshi News home page

తొమ్మిది బ్యాంకులకు ఫిచ్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ అప్‌గ్రేడ్‌

Jun 16 2022 8:49 AM | Updated on Jun 16 2022 8:55 AM

Fitch Agency Upgraded 9 Banks Rating - Sakshi

న్యూఢిల్లీ: రేటింగ్‌ దిగ్గజం ఫిచ్‌ బుధవారం తొమ్మిది భారత్‌ బ్యాంకుల రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ చేసింది.  ఫిచ్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ అయిన తొమ్మిది బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (న్యూజిలాండ్‌), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ)లు ఉన్నాయి. తొమ్మిది బ్యాంకుల లాంగ్‌టర్మ్‌ ఇష్యూయర్‌ డిఫాల్ట్‌ రేటింగ్స్‌ (ఐడీఆర్‌) రేటింగ్‌ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ చేసినట్లు ఫిచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

ఎగ్జిమ్‌ బ్యాంక్‌ లాంగ్‌టర్మ్‌ ఐడీఆర్‌ కూడా... 
కాగా, ఎగుమతులు–దిగుమతుల వ్యవహారాల భారత్‌ బ్యాంక్‌ (ఎగ్జిమ్‌) లాంగ్‌టర్మ్‌ ఐడీఆర్‌ను కూడా ‘నెగటివ్‌’ నుంచి ‘స్టేబుల్‌’కు అప్‌గ్రేడ్‌ చేసినట్లు ఫిచ్‌ మరొక ప్రకటనలో తెలిపింది.  భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్‌’ను ఈ నెల 10వ తేదీన ఫిచ్‌  రెండేళ్ల తర్వాత ‘నెగటివ్‌’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్‌ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల  మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్‌ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్‌ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్‌  పేర్కొంది. కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ నిర్ణయానికి కారణమని తెలిపింది.   

చదవండి: బ్యాంక్‌ ఉద్యోగ సంఘాల సమ్మె,వారానికి 5 రోజులే పనిచేస్తాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement