21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం | Finance Ministry calls meeting of PSU bank chiefs on Sep 21 2022 | Sakshi
Sakshi News home page

21న బ్యాంకర్లతో ఆర్థికశాఖ సమీక్షా సమావేశం

Published Tue, Sep 20 2022 6:30 AM | Last Updated on Tue, Sep 20 2022 6:30 AM

Finance Ministry calls meeting of PSU bank chiefs on Sep 21 2022 - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ నెల 21వ తేదీన (బుధవారం) ప్రభుత్వ రంగ బ్యాంక్‌ చీఫ్‌లతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనుంది. పీఎస్‌బీలు, ఫైనాన్షియల్‌ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఎంపిక ప్రణాళకలపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించనుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్‌ (జీఈఎం) పోర్టల్‌ ద్వారా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ సంస్థల ప్రొక్యూర్‌మెంట్‌ పక్రియపై కూడా ఈ సమావేశం చర్చిస్తుంది.

ఫైనాన్షియల్‌ సేవల కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా నేతృత్వంలో జరగనున్న ఈ వర్చువల్‌ సమావేశంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సంస్థల చీఫ్‌లు పాల్గొంటారు. ఈ ఏడాది అక్టోబర్‌ 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించనున్న ప్రత్యక ‘స్వచ్ఛతా’ కార్యక్రమ 2.0 ప్రచారం, సన్నద్ధతపై కూడా సమావేశం చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement