ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇవే! | Sakshi
Sakshi News home page

ఆయా బ్యాంకుల్లో లేటెస్ట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఇవే!

Published Sat, May 25 2024 1:46 PM

Fd Interest Rate Up To 9 1 pc In May 2024: Check Which Banks Have Revised Fixed Deposit Rates

ఫిక్స్‌డ్ డిపాజిట్ దారులకు అలెర్ట్‌. మే నెలలో చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించాయి. వాటిల్లో ఎస్‌బీఐ, డీసీబీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఆర్‌బీఎస్‌, క్యాపిటల్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి .

డీసీబీ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు 
డీసీబీ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను (రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు) సవరించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రేట్లు మే 22, 2024 నుండి అమలులోకి వస్తాయి.

19 నెలల నుండి 20 నెలల కాలవ్యవధిలో సాధారణ కస్టమర్లకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.55శాతం అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తోంది. అత్యధిక పొదుపు ఖాతా వడ్డీ రేటు 8శాతం వరకు అందించబడుతుంది. పొదుపు ఖాతాపై 8 శాతం వరకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.55 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది.

ఐడీఎఫ్‌సీ
ఐడీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి

బ్యాంక్ ప్రస్తుతం సాధారణ పౌరులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం నుండి 7.90 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్‌ల కోసం వడ్డీ రేటు 3.50 శాతం నుండి 8.40 శాతం వరకు ఉంటుంది. 500 రోజుల కాలవ్యవధిపై అత్యధిక వడ్డీ రేటు 8శాతం, 8.40శాతం వరకు అందిస్తుంది.  

ఎస్‌బీఐ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రిటైల్ డిపాజిట్లు (రూ. 2 కోట్ల వరకు), బల్క్ డిపాజిట్లపై (రూ. 2 కోట్ల కంటే ఎక్కువ) నిర్దిష్ట కాల వ్యవధిలో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త ఎఫ్‌డీ రేట్లు మే 15, 2024 నుండి అమలులోకి వస్తాయి.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి. బ్యాంక్ సాధారణ పౌరులకు 4 శాతం నుంచి 8.50 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, బ్యాంక్ 4.60 శాతం నుంచి  9.10 శాతం మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధిలో అత్యధిక వడ్డీ రేటు 8.50 శాతం నుంచి 9.10 శాతం వరకు పొందవచ్చు.

ఆర్‌బీఎల్‌లో వడ్డీ రేట్లు 
ఆర్‌బీఎల్‌ బ్యాంక్ 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన ఎఫ్‌డీ వడ్డీ రేట్లు మే 1, 2024 నుండి అమలులోకి వస్తాయి.

ఆర్‌బీఎల్‌ బ్యాంక్ 18 నుంచి  24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధికంగా 8శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్‌డీ వ్యవధిలో, సీనియర్ సిటిజన్ 0.50 శాతం అదనంగా పొందవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్‌లు (80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ) 8.75శాతం అదనపు వడ్డీ రేటుకు అర్హులు.

Advertisement
 
Advertisement
 
Advertisement