Facebook Whatsapp: కొత్త ఐటీ చట్టాలపై కోర్టుకెక్కిన వాట్సాప్‌, ఫేస్‌బుక్‌

Facebook And WhatsApp Challenging IT Rules In Delhi High Court - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను సవాల్‌ చేస్తూ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌, సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హై కోర్టు పిటిషినర్ల అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరింది.

ఆ వివరాలు కావాలి
ఇటీవల భారత ప్రభుత్వం సోషల్‌ మీడియా నియంత్రణకు కొత్త ఐటీ చట్టాలను అమల్లోకి తెచ్చింది. అందులోని నిబంధనల ప్రకారం ఏదైనా సమాచారం సోషల్‌ మీడియా లేదా మెస్సేజింగ్‌ యాప్‌లలో వచ్చినప్పుడు.. మొట్ట మొదట ఆ మేసేజ్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే వివరాలను కేంద్రానికి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్స్‌ అందివ్వాల్సి ఉంటుంది. అయితే ఇలా చేయడం రాజ్యంస స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి ఫేస్‌బుక్‌, వాట్సప్‌లు.

రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం
తమ ఖాతాదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని తమకు ఇవ్వమని ప్రభుత్వం కోరడం రాజ్యంగ స్ఫూర్తికి  ఇది విరుద్ధమంటున్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తాము ఖాతాదారులకు హామీ ఇచ్చామని,. దాన్ని ఉల్లంఘించలేమంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 

విచారణ వాయిదా
ఫేస్‌బుక్‌, వాట్సప్‌లు లెవనెత్తుతున్న అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది. అయితే ఈ కేసు వాదిస్తున్న ప్రధాన న్యాయవాది ప్రస్తుతం అందుబాటులో లేనందున విచారణ కొద్ది కాలం వాయిదా వేయాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో ఈ కేసు విచారణను ఆక్టోబరు 22కి కోర్టు వాయిదా వేసింది. 

చదవండి : Black Holes: విశ్వంలో మొట్టమొదటిసారి.. మూడు భారీ బ్లాక్‌హోల్స్‌ విలీనం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top