Black Holes: విశ్వంలో మొట్టమొదటిసారి.. మూడు భారీ బ్లాక్‌హోల్స్‌ విలీనం!

Three Supermassive Black Holes Merge Discover By India Researchers - Sakshi

విశ్వ పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్‌) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మరో విశేషం ఏంటంటే.. భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం. 

పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్‌ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను  ‘ఆస్రోనమీ’ జర్నల్‌లో పబ్లిష్‌ చేశారు. ‘‘మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్‌జీసీ7733ఎన్‌.. అనేది ఎన్‌జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందుగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

గెలాక్సీ జంట..  ఎన్‌జీసీ7733ఎన్‌-ఎన్‌జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు.

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్రో‍్టఫిజిక్స్‌కు చెందిన జ్యోతి యాదవ్‌, మౌసుమి దాస్‌, సుధాన్షు బార్వే.. ఆస్రో‍్టసాట్‌ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ సాయంతో వీటిని వీకక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్‌ఎస్‌ఎఫ్‌, చిలీ వీఎల్‌టీ, యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు.  అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్‌ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం రిలీజ్‌ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top