ఈరిస్‌కు.. రెడ్డీస్‌ డెర్మటాలజీ బ్రాండ్స్‌ | Eris Lifesciences buys dermatology brands from Dr Reddys | Sakshi
Sakshi News home page

ఈరిస్‌కు.. రెడ్డీస్‌ డెర్మటాలజీ బ్రాండ్స్‌

Mar 17 2023 12:44 AM | Updated on Mar 17 2023 12:44 AM

Eris Lifesciences buys dermatology brands from Dr Reddys - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న ఈరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ తాజాగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ నుంచి తొమ్మిది రకాల డెర్మటాలజీ బ్రాండ్స్‌ను దక్కించుకుంది. డీల్‌ విలువ రూ.275 కోట్లు. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ రంగంలో డీల్‌ తదనంతరం ఈరిస్‌ 7 శాతం వాటాతో మార్కె ట్లో మూడవ స్థానానికి ఎగబాకనుంది.

2022 మే నెలలో రూ.650 కోట్లతో ఓక్‌నెట్‌ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడం ద్వారా డెర్మటాలజీ విభాగంలోకి ఈరిస్‌ ప్రవేశించింది. 2023 జనవరిలో గ్లెన్‌మార్క్‌ నుంచి తొమ్మిది డెర్మటాలజీ బ్రాండ్స్‌ను రూ.340 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ విభాగాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లకు రూ.1,265 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement