TwitterDeal మస్క్‌ బాస్‌ అయితే 75 శాతం జాబ్స్‌ ఫట్? ట్విటర్‌ స్పందన

Elon Musk Plans To Cut 75pc Twitter Workforce twitter Says no plans - Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ మైక్రో-బ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌ కొనుగోలు డీల్‌ పూర్తయితే సంస్థలో 75 శాతం ఉద్యోగులపై వేటు వేయనున్నారనే వార్తలు కలకలం రేపాయి. ట్విటర్‌ కొనుగోలుకు మరోసారి పావులు కదుపుతున్న తరుణంలో ఉద్యోగాల తొలగింపు అనే నివేదికలు  ఆందోళన రేపాయి.

ఇదీ చదవండి: JioBook: రూ.15 వేలకే ల్యాప్‌టాప్‌, వారికి బంపర్‌ ఆఫర్‌

ఒక వేళ మస్క్‌ ట్విటర్‌ బాస్‌ అయితే  ఆ తరువాత భారీగా  సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నట్లు తాజాగా ఒక నివేదిక తెలిపింది. కంపెనీలోని 7,500 మంది కార్మికులలో దాదాపు 75శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు, కొనుగోలు డీల్‌లో కాబోయే పెట్టుబడిదారులతో మస్క్‌ చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.

అయితే, ట్విటర్‌ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగులను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అసలు అలాంటి ప్లాన్‌ ఏదీ లేదని గురువారం సిబ్బందికి సమాచారాన్ని అందించింది. ఈ మేరకు జనరల్ కౌన్సెల్ సీన్ ఎడ్జెట్ గురువారం ఉద్యోగులకు ఇమెయిల్  పంపించారు.  (JioBook: రూ.15 వేలకే ల్యాప్‌టాప్‌, వారికి బంపర్‌ ఆపర్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top