వైరల్‌ వీడియో: ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ఎలన్‌ మస్క్‌ జిరాక్స్‌, చైనా వోడేనంట!

Elon Musk Chinese Version Man Video Viral In Internet - Sakshi

టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. అనని మాటలు అన్నట్లు, చెయ్యని చేష్టలు చేసినట్లు చూపించగలిగే జిమ్మిక్కు చేయగలుగుతున్నారు. అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకునేందుకు చాలా టైం పడుతోంది. ఇదిలా ఉంటే ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్న ఓ వీడియోపై రకరకాల రియాక్షన్లు వెలువడుతున్నాయి. 

ఎలన్‌ మస్క్‌.. టెస్లా కంపెనీ సీఈవోగా, ప్రపంచంలో అత్యధిక సంపద కలిగి ఉ‍న్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అలాంటి వ్యక్తిని పోలి ఉన్న మరో వ్యక్తి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో సర్క్యూలేట్‌ అవుతోంది.  

చైనీస్‌ టిక్‌టాక్‌ యాప్‌ డౌయిన్‌ నుంచి గత రెండు వారాలుగా ఓ వీడియో వైరల్‌ అవుతోంది. బ్లాక్‌ జాకెట్‌ వేసుకున్న ఓ వ్యక్తి అచ్చం ఎలన్‌ మస్క్‌లా ఉండడం, అదే తరహా హవభావాలు ప్రదర్శించడం ఆ వీడియోలో ఉంది. అక్కడి నుంచి డౌన్‌లోడ్‌ చేసిన ఆ వీడియోను తాజాగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఇతర మాధ్యమాల ద్వారా వైరల్‌ చేస్తున్నారు. 

ఆ వీడియో ఒరిజినలేనా? లేదంటే డీప్‌ఫేక్‌ టెక్నాలజీ ద్వారా రూపొందించిందా? ఇంతకీ అతని పేరు, ఊరు, ఐడెంటిటీ గురించి తెలియాల్సి ఉంది. ఈ లోపు ‘యి లాంగ్‌ మస్క్‌’ అంటూ వెటకారంగా చైనీస్‌ వెర్షన్‌ అంటూ ఆ వీడియోను వైరల్‌ చేస్తున్నారు చాలా మంది. 

ఇంకొందరు ఏకంగా ఎలన్‌ మస్క్‌కే ట్యాగ్‌ చేసినప్పటికీ.. ఆయన ఇంకా స్పందించలేదు. ఒకవేళ చూసి ఉంటే కచ్చితంగా తన స్టయిల్‌లో స్పందించేవాడేమో.   అది డీప్‌ ఫేక్‌ వీడియో గనుక అయితే మాత్రం.. ఇలాంటి వ్యవహారం కొత్తేం కాదు. గతంలో జెఫ్‌ బెజోస్‌, ఎలన్‌ మస్క్‌ల మీద స్టార్‌ ట్రెక్‌ డీప్‌ఫేక్‌ వీడియో ఒకటి విపరీతంగా వైరల్‌ అయ్యింది. లేదు అది నిజమే అయితే గనుక ఆ చైనీస్‌వెర్షన్‌ ఎలన్‌ మస్క్‌ ఫేమ్‌ చాలాకాలం పాటు పదిలంగా ఉండడం ఖాయం.

చదవండి: ఆ టైంలో చేతిలో చిల్లి గవ్వ లేదు: ఎలన్ మస్క్

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top