నోబడి - అది నా పేరు.. మస్క్ ట్వీట్ వైరల్! | Is Elon Musk Changing His Name Check The Tweet | Sakshi
Sakshi News home page

Elon Musk: నోబడి - అది నా పేరు.. మస్క్ ట్వీట్ వైరల్!

Sep 26 2023 2:51 PM | Updated on Sep 26 2023 3:40 PM

Is Elon Musk Changing His Name Check The Tweet - Sakshi

ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ఎక్స్.కామ్, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.  అయితే ఈయన ఇటీవల చేసి ఒక ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా 'నోబడి - అది నా పేరు' (Nobody—that’s my name) అంటూ తన అధికారిక ట్విటర్ పేజీలో షేర్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి ఈ పోస్ట్‌ని 3 మిలియన్స్ కంటే ఎక్కువమంది చూసారు. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

కొత్తగా ఆలోచించడం 'మస్క్'కి కొత్తేమీ కాదు. ఇప్పటికే త కొడుకుకి ఎక్స్ఏఈఏ-12 మస్క్ అంటూ ఓ కొత్త పేరు పెట్టాడు. ట్విటర్ పేరుని 'ఎక్స్'గా మార్చదు. ఇవన్నీ చూస్తుంటే మస్క్ పేరుని 'నోబడీ'గా పెట్టుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని నెటిజన్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే!

ఇదిలా ఉండగా ఇటీవల మార్కెట్లో విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్ కొనాలనుకుంటున్నట్లు కూడా ట్వీట్ చేసాడు. ఐఫోన్ ఫోటోలు & వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయని. అందుకే లేటెస్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా మస్క్ ఏ మోడల్, ఏ కలర్ కొంటాడనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement