120 కిమీ రేంజ్‌తో మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ధరెంతో తెలుసా?

EeVe Soul electric scooter launched with a 120 km range - Sakshi

ఈవీ ఇండియా అనే ఎలక్ట్రిక్ వాహన కంపెనీ ఇటీవల తన సోల్ అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ₹1.39 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఇది 'యూరోపియన్ టెక్నాలజీ' ప్రమాణాల ఆధారంగా వస్తుంది అని కంపెనీ పేర్కొంది. ఇందులో ఐఓటీ ఎనేబుల్డ్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, జిపిఎస్ నావిగేషన్, యుఎస్‌బి పోర్ట్, సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్ జియో ట్యాగింగ్, కీలెస్ ఫీచర్, రివర్స్ మోడ్, జియో ఫెన్సింగ్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.

ఇది మూడు సంవత్సరాల వారెంటీతో మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్ అధునాతన లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్(ఎల్ఎఫ్పి) బ్యాటరీ చేత పనిచేస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీలను ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఈ స్కూటర్ని 0-100% నుంచి ఛార్జ్ చేయడానికి సుమారు 4-5 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది అని తెలిపింది. ఈ స్కూటర్కి డ్యుయల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. దీని డిజైన్ కూడా కుర్రకారును ఆకట్టుకునేలా ఉంది.

(చదవండి: పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top