జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ ప్లాన్లపై బోలెడు ఆఫర్లు, రూ.4వేల వరకు బెనిఫిట్స్‌!

Dussehra Festival Offer: Jio Announce Up To Rs 4500 Benefits For These Users - Sakshi

దసరా పండుగ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా జియో కూడా తగ్గేదేలే అంటూ తన కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లను ప్రకటించింది. దసరా సందర్భంగా రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్‌ కూడా అందిస్తోంది జియో. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. కొన్ని రోజులే మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్‌ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్‌ సొంతం చేసుకోవచ్చు. 

జియో ఫైబర్ తన కస్టమర్లకు ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో పాటు పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులో ఉంచింది. తాజాగా జియో ఫైబర్‌కు చెందిన రెండు పోస్ట్‌ పెయిడ్ ప్లాన్స్‌ తన కొత్త కస్టమర్ల కోసం రూ. 599, రూ. 899 ప్లాన్లపై అవాకయ్యే ఆఫర్లును జత చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. JioFiber ప్రకటించిన ఫెస్టివల్ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం..

JioFiber ₹599 ప్లాన్‌
ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 30 Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో సోనీలివ్‌( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్‌ ( Disney+ Hotstar), వూట్‌ సెలెక్ట్‌( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్‌, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. 

ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్‌ కూడా ఉన్నాయండోయ్‌
►రిలయన్స్ డిజిటల్‌లో ₹1000 తగ్గింపు
►Myntra లో ₹1000 తగ్గింపు, Ajioలో ₹1000 తగ్గింపు
►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు.

జియో ఫైబర్‌ ఫెస్టివల్ బొనాంజా కింద ఈ ప్రయోజనాలను పొందాలంటే, కొత్త కస్టమర్లు తప్పనిసరిగా కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

JioFiber ₹899 ప్లాన్‌
ఈ ప్లాన్‌లో 100 Mbps డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్‌ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు సోనీలివ్‌( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్‌ ( Disney+ Hotstar), వూట్‌ సెలెక్ట్‌( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్‌స్క్రిప్షన్‌ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్‌, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. 

ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్‌ కూడా ఉన్నాయండోయ్‌
►రిలయన్స్ డిజిటల్‌లో ₹500 తగ్గింపు
► Myntraలో ₹500 తగ్గింపు
►Ajioలో ₹1000 తగ్గింపు
►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు.
అయితే జియో ఫైబర్‌ కొత్త కస్టమర్ కనీసం 3 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి.

చదవండి: అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top