అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే!

Bank Holidays October: Banks Closed For 7 Days From Oct 3 Only These Cities - Sakshi

అక్టోబరు నెల వస్తే బ్యాంక్‌ కస్టమర్లు వారి ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల దాదాపు పండుగలతో మనముందుకు వస్తుంది. ఈ ఏడాది పండుగలను పరిశీలిస్తే.. దసరా,  దుర్గాపూజ, దీపావళి, ఛత్ పూజ వంటి అనేక ఇతర ముఖ్యమైన పండుగలు అక్టోబర్‌లోనే ఉన్నాయి. ఈ సెలవులు నెలలో వచ్చే పండుగలతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు వంటి రెగ్యులర్ హాలిడేస్‌ కూడా కలిపి ఎక్కువ రోజులే ఉన్నాయి. ఈ సారి అక్టోబర్‌ 3 నుంచి 7 రోజులు ఈ నగరాల్లో బ్యాంకులు పని చేయవు. ఈ విషయాన్ని గమనించి కస్టమర్లు బ్యాంకుల్లో అత్యవసర పనులు ఉంటే ముందుగా ప్లాన్‌ చేసుకోవడం ఉత్తమం. 

అక్టోబర్ 3 నుంచి బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1 సందర్భంగా బ్యాంకులు హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ సందర్భంగా పని చేయలేదు. ఇక ఈరోజ అక్టోబర్ 2న కూడా గాంధీ జయంతి ఉంది. అలాగే ఆదివారం కూడా.

అక్టోబర్ 3న దుర్గా పూజ సందర్భంగా బ్యాంకులకు పని చేయవు. అగర్తలా, భువనేశ్వర్, గువాహటి, ఇంపాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీలో ఈ సెలవు వర్తిస్తుంది. ఇక మిగతా ప్రాంతాల్లో బ్యాంకులు పని చేస్తాయని గుర్తించుకోవాలి.

అక్టోబర్ 4: దుర్గాపూజ/దసరా (మహా నవమి)/ఆయుధ పూజ/ శ్రీమంత శంకరదేవుని జన్మోత్సవం సందర్భంగా.. అగర్తల, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురంలలో బ్యాంకులకు సెలవు. 

అక్టోబర్ 5: దుర్గాపూజ/దసరా (విజయదశమి) సందర్భంగా.. ఆ రోజు ఇంఫాల్ మినహా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు.

అక్టోబర్ 6: దుర్గా పూజ(దసైన్‌) సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో బ్యాంకులు పని చేయవు.

అక్టోబర్ 7: గ్యాంగ్‌టక్‌లో బ్యాంక్ హాలిడే ఉంది.

అక్టోబర్ 8: రెండో శనివారం సందర్బంగా బ్యాంకులు పని చేయవు. అలాగే ఆ రోజు మహమ్మద్ ప్రవక్త జయంతి కూడా ఉంది. భోపాల్, జమ్మూ, కొచ్చి, శ్రీనగర్, తిరుపనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

అక్టోబర్ 9: ఆదివారం రెగ్యులర్ సెలవు.

కాగా బ్యాంక్ సెలవులనేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. అయితే కస్టమర్లలు బ్యాంక్ హాలిడేస్‌లో కూడా ఆన్‌లైన్ సేవలు.. మొబైల్ బ్యాంకింగ్, నెట్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. 

చదవండి: కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top