కరోనా భయం తగ్గింది.. దేశీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణాలు

DGCA Announced That Civil Aviation Demand Gradually Increased to Before Covid - Sakshi

అక్టోబర్‌లో 70 శాతం అప్‌ 

వివరాలు ప్రకటించిన డీజీసీఏ  

ముంబై: దేశీయంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అక్టోబర్‌లో ఇది సుమారు 90 లక్షలుగా నమోదైంది. గతేడాది అక్టోబర్‌లో నమోదైన 53 లక్షలతో పోలిస్తే ఇది దాదాపు 70 శాతం అధికం. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం ఇండిగో 48 లక్షలు, ఎయిరిండియా 11 లక్షలు, విస్తార 7 లక్షలు, ఎయిర్‌ఏషియా ఇండియా 6 లక్షలు, స్పైస్‌జెట్‌ 8.10 లక్షలు, గో ఫస్ట్‌ 8.84 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాయి. కీలకమైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టుల్లో సమయపాలనకు సంబంధించి ఇండిగో (88.8 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. ఇండిగో మార్కెట్‌ వాటా అత్యధికంగా 53.5 శాతంగా ఉంది. ఎయిరిండియా 11.8 శాతం, గో ఫస్ట్‌ 9.8 శాతం, స్పైస్‌జెట్‌ 9 శాతం, విస్తారా 7.8 శాతం వాటా దక్కించుకున్నాయి.   
 

చదవండి: ఆగేదేలే! అమెరికా టూ ఇండియా.. నాన్‌స్టాప్‌ ఫ్లైట్‌ సర్వీసులు..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top