Saif Ali Khan Net Worth 2023: ‘దేవర’ స్టార్‌ యాక్టర్‌ నెట్‌వర్త్‌, లగ్జరీకార్లు: తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Devara Actor Saif Ali Khan massive Net Worth remuneration Cars and more - Sakshi

ప్యాన్‌ ఇండియాస్టార్‌ జూ.ఎన్టీఆర్ అప్‌కమింగ్‌ మూవీ దేవర మూవీలో విలన్‌ అలరించబోతున్న బాలీవుడ్‌  స్టార్‌ యాక్టర్‌ సైఫ్ అలీ ఖాన్.  బర్త్‌డే సందర్భంగా  సైఫ్‌ ఫస్ట్‌ లుక్‌ బాగానే  ఆకట్టుకుంది. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న సైఫ్‌ భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌ల లిస్ట్‌ పెద్దదే. మంచి నటుడిగా, ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌గా అంతకుమించి బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ భర్తగా మంచి మార్కులే కొట్టేశాడు.ఆ క్రమంలో సైల్‌  అలీ ఖాన్‌ ఆస్తిఎంత? సినిమాకు  ఎంత తీసుకుంటాడు? అనేది చర్చనీయాంశంగా మారింది.  ఆ వివరాలు ఒకసారి చూద్దాం.

 పర్సనల్‌ లైఫ్‌, రాయల్‌ ఫ్యామిలీ
1970, ఆగస్టు 16న నటుడు,  ప్రముఖ  క్రికెటర్‌ , భారత జట్టు  మాజీ కెప్టెన్‌  మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడే  సైఫ్‌ అలీ ఖాన్‌. సైఫ్‌ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా చలామణి  అయ్యారు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. 1991లో  ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్‌తో  వివాహ జరిగింది. వీరికి  సారా అలీ ఖాన్ ,ఇబ్రహీం అలీ ఖాన్  ఇద్దరు సంతానం.. అయితే  13 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012, అక్టోబర్ 16న బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు తైమూర్ అలీ ఖాన్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. 

దశాబ్దాల సినీ కరియర్‌
1993లో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్‌ అరంగేట్రం చేసిన దగ్గరనుంచీ ఐకానిక్‌ క్యారెక్టర్స్‌తో  వెనుదిరిగి  చూసింది లేదు. ఓంకార, లవ్ ఆజ్ కల్, కల్ హో నా హో, హమ్ తుమ్, దిల్ చాహ్తా హై, తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్, లాల్ కప్తాన్, మెయిన్ ఖిలాడి తూ అనారీ, పరిణీత, సలామ్ నమస్తే, రేస్  ఆదిపురుష్‌ , బంటీ ఔర్‌ బబ్లీ-2తదితర చిత్రాలలో సైఫ్ గుర్తుండిపోయే పాత్రలు చాలా  ఉన్నాయి. 

సైఫ్ అలీఖాన్ కోట్ల విలువైన ఆస్తులు 
మీడియా నివేదిక ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెట్టుబడి పెట్టాడు. ముంబైలోని ప్రసిద్ధ ఫార్చ్యూన్ హైట్స్ భవనంలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ  దాదాపు రూ. 4.2 కోట్లు. దీంతోపాటు సైఫ్ తమ అపార్ట్‌మెంట్‌కి ఎదురుగా ఉన్న విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది దీన్ని అద్దెకిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ముంబైలో 6 కోట్లు విలువ చేసే మరో లగ్జరీ బంగ్లా కూడా ఉంది.

జిస్టాడ్‌లో సైఫ్ అలీ ఖాన్ చాలెట్ విలువ రూ. 33 కోట్లు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కి ఫారిన్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీతో కలిసి విదేశాలలో కొత్త ప్రదేశాల్లో చక్కర్లు కొట్టి వస్తుంటాడు.  స్విట్జర్లాండ్‌లో జిస్టాడ్‌లో చాలెట్‌( ఫాంహౌస్‌ లాంటిది)  ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని  రూ. రూ. 33 కోట్లు. భార్య కరీనా, పిల్లలు తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్‌లతో కలిసి  హాలిడేస్‌ ఎంజాయ్‌ చేస్తారు. 

సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఇల్లు, పటౌడీ ప్యాలెస్ 
ముంబైలో సైఫ్ అలీ ఖాన్ కలిగి ఉన్న అన్ని అత్యంత ఖరీదైన ఆస్తులతో పాటు, హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ చాలా ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవచ్చు. సైఫ్  వారసత్వ సంపద  విలువ రూ. 5000 కోట్లు. చివరి పాలక నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, దివంగత మన్సూర్ అలీ ఖాన్‌ వారసత్వ ఆస్తిలో ముఖ్యమైంది. పటౌడీ ప్యాలెస్ 'ఇబ్రహీం కోఠి' పేరుతో కూడా పిలుస్తారు.150 గదులు, ఏడు బెడ్‌రూమ్‌లు,  పలు డ్రాయింగ్ రూమ్‌లు, ఏడు బిలియర్డ్ రూమ్‌లులాంటి ఫీచర్లతో హర్యానాలో 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. బహుళ నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్‌కు చెందిన  పటౌడీ ప్యాలెస్ విలువ రూ. 800 కోట్లు. అలాగే భోపాల్‌లోని పటౌడీ ప్యాలెస్ రూ. 4,200 కోట్లు. 

లగ్జరీ కార్లు
రాయల్ ఇమేజ్‌, డాషింగ్ యాక్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ కార్లు అతని గ్యారేజీలోఉన్నాయి.  లగ్జరీ కార్ కలెక్షన్‌లో ఫోర్డ్ మస్టాంగ్ జిటి (రూ. 74 లక్షల నుండి రూ. 76 లక్షలు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 కోట్ల నుండి 4.17 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ (రూ. 93 లక్షలు) , లెక్సస్ 470 (రూ. 35 లక్షల నుండి రూ. 38 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు), బెంజ్‌  ఎస్‌- క్లాస్ (రూ. 1.71 కోట్ల నుండి 1.80 కోట్లు), ఆడి R8 (రూ. 2.72 కోట్లు) .

 డైమండ్‌ రోలెక్స్  వాచ్‌
ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన,  రాయల్ వాచీల కలెక్షన్‌ సైఫ్‌  సొంతం.  బ్రూనై సుల్తాన్ కుమార్తె నుండి తనకు లభించిన బహుమతి అని సైఫ్  ఒక సందర్భంలో వెల్లడించాడు. అంతేకాదు కోటి రూపాయల విలువైన లగ్జరీ వాచ్‌ను ఒకానొక సందర్బంగా విక్రయించాలని చూశాననీ, ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన భార్య కరీనా కపూర్‌కి ఇచ్చినట్టు తెలిపాడు.

రెమ్యూనరేషన్‌, నెట్‌వర్త్‌
మైథలాజికల్‌ మూవీ ఆదిపురుష్‌లో ‘రావణ్‌’ పాత్రకోసం 12 కోట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో అతని రెమ్యూనరేషన్‌ రూ. ఒక్కో సినిమాకు 10-15 కోట్లుగా అంచనా. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌,  ఓటీటా ప్రాజెక్ట్‌లలో కూడా చాలా యాక్టివ్‌.  అలా వార్షిక ఆదాయంరూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పైమాటే. సో సుదీర్ఘకాలంగా బాలీవుడ్‌లో కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ నికర విలువ సుమారు రూ. 1,180 కోట్లుగా ఉంటుందని అంచనా.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top