జూన్‌ నాటికి పవన్‌హన్స్‌ అమ్మకం

Details About Pawan Hans sale - Sakshi

పవన్‌హన్స్‌ స్వాధీనం చేసుకోనున్న స్టార్‌9

న్యూఢిల్లీ: హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌హన్స్‌ను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేటు లిమిటెడ్‌కు జూన్‌ నాటికి అప్పగించడం పూర్తవుతుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. బిగ్‌ చార్టర్‌ ప్రైవేటు లిమిటెడ్, మహారాజ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్, ఆల్మాస్‌ గ్లోబల్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ ఎస్‌పీసీతో కూడిన కన్సార్షియమే స్టార్‌ 9 మొబిలిటీ. పవన్‌ హన్స్‌ కొనుగోలుకు రూ.211.14 కోట్లను కోట్‌ చేసి గరిష్ట బిడ్డర్‌గా ఈ సంస్థ నిలవడం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వ్‌ ధర రూ.199.92 కోట్లుగా ఉంది. 

స్టార్‌9 మొబిలిటీ కొన్ని అంశాల్లో అర్హతల ప్రమాణాలను చేరుకోలేదన్న ఆరోపణలను ఆ అధికారి ఖండించారు. ప్రభుత్వం కనీసం రూ.300 కోట్ల నెట్‌వర్త్‌ ఉండాలని నిర్ధేశించగా, గరిష్ట బిడ్డర్‌ స్టార్‌9 మొబిలిటీకి రూ.691 కోట్ల నెట్‌వర్త్‌ ఉన్నట్టు చెప్పారు. కన్సార్షియంలోని మహారాజ ఏవియేషన్‌ 2008లో ఏర్పాటు కాగా, బిగ్‌చార్టర్‌ 2014లో ఏర్పడినట్టు గుర్తు చేశారు. ఆల్మాస్‌ గ్లోబల్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ సైతం 2017 నుంచి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ మూడు సంస్థలు భారతీయులకు చెందినవేనని పేర్కొన్నారు.   

చదవండి: ఓఎన్‌జీసీకే మెజారిటీ ఆయిల్, గ్యాస్‌ బ్లాకులు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top