Hyderabad: ఇళ్ల రిజిస్ట్రేషన్లలో రికార్డ్‌! డిసెంబరులో రూ.2,340 కోట్లు

Details about House Registration In Hyderabad For December 2021 - Sakshi

కరోనా కష్టాలు చుట్టుముట్టినా హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం జోరు మీదుంది.  2021 ఏడాదికి సంబంధించి దేశంలోనే ఎక్కువ ఇళ్లు అమ్ముడైన మెట్రో సిటీగా మొదటి స్థానంలో నిలిచింది. ఏడాది చివరన డిసెంబరులో అమ్ముడైన ఇళ్ల యూనిట్ల సంఖ్యలో తగ్గుదల కనిపించినా.. రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూలో తగ్గేదేలే అనిపించింది. 

రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సంబంధించి నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్‌ నగర పరిదిలో 3,931 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్‌ విలువ ఏకంగా రూ.2,340 కోట్లుగా నిలిచింది. గతేడాది ఇదే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో పోల్చితే 16 శాతం వృద్ధి కనిపించింది. డిసెంబరులో అమ్ముడైన ఇళ్లలో అత్యధికం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నాయి.  జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 2,693, హైదరాబాద్‌ 1,180, సంగారెడ్డి  66 ఇళ్లుగా ఉన్నాయి. 

గతేడాది హైదరాబాద్‌ నగర పరిధిలో మొత్తం 44,278 ఇళ్ల రిజిస్ట్రేషన్‌ జరగగా వాటి విలువ రూ.25,330 కోట్లుగా ఉంది. కరోనా సంక్షోభం చుట్టుముట్టినా రియల్‌ ఎస్టేట్‌ రంగం స్థిరంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉందని నైట్‌ ఫ్రాంక్‌ పేర్కొంది. 

చదవండి: ఇకపై అపార్ట్‌మెంట్లలో మరిన్ని లిఫ్టులు? కొత్త చర్చకు తెర తీసిన హైదరాబాద్‌ ఘటన!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top