ఇండియన్‌ ఆర్మీలోకి ప్రైవేట్‌ సంస్థలు! ఇప్పటికే..

Defence Ministry To Allow Private Companies To Military Hardware Sector - Sakshi

కేంద్ర ప్రభుత‍్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మానిర్బర్‌ భారత్‌ పథకం కింద మిలటరీ హార్డ్‌వేర్‌ విభాగంలోకి ప్రైవేట్‌ సంస్థల్ని ఆహ్వానించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ డిఫెన్స్‌ అక్విజేషన్‌ ప్రొసిజర్స్‌ (డీఏపీ) మ్యాన‍్యువల్‌గా సవరించాలని నిర్ణయించింది. ఇండియన్‌ డిఫెన్స్‌కు (పీఎస్‌యూ) చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు మిలటరీకి సంబంధించిన ఆయుధాలు తయారు చేసేవి. ఇప్పుడీ డీఏపీ సవరణలతో ప్రైవేట్‌ సంస్థలు ఎక్కువ భాగం డిఫెన్స్‌కు చెందిన ఆయుధాల్ని తయారు చేసేందుకు ఊతం ఇచ్చినట్లైందని నివేదికలు చెబుతున్నాయి.   

ప్రైవేట్‌ సంస్థల సహకారంతో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ (ఐఎంఆర్‌హెచ్‌ )నను అభివృద్ధి, తయారీని కేంద్ర రక్షణ శాఖ ప్రయత్నిస్తుంది. దీంతో ఇండియన్‌ ఆర్మీ ఇన్వెంటరీలో ఉన్న రష్యా తయారు చేసిన ఎంఐ-17,ఎంఐ-8 హెలికాప్టర్‌లు భర్తీ కానున్నాయి. కాగా,13టన్నుల బరువైన ఈ మల్టీరోల్‌ హెలికాఫ్టర్‌ వైమానిక దాడిలో భారత సాయుధ బలగాల్ని రంగంలోకి దించడంతో పాటు, ఎయిర్‌ ఎటాక్‌, యాంటీ సబ్‌ మెరైన్‌, యాంటీ షిప్‌, మిలటరీ ట్రాన్స్‌ పోర్ట్‌, వీవీఐపీ వంటి విభాగాల్లో కీలకంగా పనిచేస్తుంది. 

ఫ్రెంచ్‌ కంపెనీతో ఎంఓయూ
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్‌ ఎరో నాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), ప్రైవేట్‌ సంస్థలు కలిసి వచ్చే ఏడేళ్లలో ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ తయారీని పూర్తి స్థాయిలో ప్రారంభించేలా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. దీంతో పాటు నేవల్ వేరియంట్‌తో సహా ఐఎంఆర్‌ హెచ్‌ ఇంజిన్‌ను తయారీ, ఉత్పత్తితో పాటు మద్దతు అందించేలా కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు కానుంది. జులై 8న ఈ జాయింట్‌ వెంచర్‌ సంస్థను ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఏఎల్‌ తో విమానాల విడిభాగాల తయారీలో పేరు గాంచిన ఫ్రెంచ్‌ సంస్థ సఫ్రాన్‌ అవగాహన ఒప్పందంపై సంతకం చేసినట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top