‘ధరణి’ ఒక్కటే కాదు.. దేశం మొత్తం సొలార్‌ వ్యవస్థ తీరు ఇది!

Dawn Of Solar power stations In Indian Rural Area - Sakshi

ధరణి.. బిహార్‌ రాష్ట్రంలో ఓ కుగ్రామం. అయితేనేం అరుదైన ఘనత ద్వారా వార్తల్లోకి ఎక్కింది. సోలార్‌ మినీ గ్రిడ్స్‌లో బిహార్‌లోనే తొలి సోలార్‌ గ్రామం ఘనతను ధరణి సాధించింది.  కానీ, ఆ ముచ్చట కొన్నాళ్లు మాత్రమే కొనసాగింది. 

2014 ఆగష్టులో బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ జెహానాబాద్‌ జిల్లా ధరణి గ్రామం ఈ సోలార్‌ ప్రాజెక్టును లాంఛ్‌ చేశారు. ముప్ఫై ఏళ్లపాటు అంధకారంలో ఉన్న గ్రామంలో సోలార్‌ వెలుగులు సొగసులబ్బాయి. కానీ,   కేవలం మూడేళ్లపాటే సోలార్‌ విలేజ్‌గా కొనసాగింది. ఆ తర్వాత మెయింటెన్స్‌ లేకపోవడంతో సోలార్‌ గ్రిడ్‌ పని చేయకుండా పోయింది. అప్పటి నుంచి ఆ సెటప్‌ అంతా మూలన పడిపోయింది. ఇప్పుడా ప్రాజెక్టు పశువుల పాకగా మారింది. 

భారంగా..

ఈ నేపథ్యంలో సంప్రదాయ థర్మల్‌ పవర్‌కే ప్రాధాన్యం ఇచ్చారు ఆ గ్రామస్తులు. 

ఆ ఒక్క గ్రామమే కాదు.. దేశంలో ప్రభుత్వాలు చేపట్టిన సోలార్‌ ప్రాజెక్టుల తీరు ఇలాగే ఉంది.  

సోలార్‌ పవర్‌ను చాలా చోట్ల నకిలీ కరెంట్‌గా భావించడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు సోలార్‌ కరెంట్‌పై సరైన అవగాహన కల్పించడంలో విఫలం అయ్యింది. 

సోలార్‌తో అధిక టారిఫ్‌లు భారంగా మారుతున్నాయి. దీనికంటే సంప్రదాయ విద్యుత్‌కే టారిఫ్‌ రేట్లు తక్కువగా ఉండడంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 

సబ్సిడీల విషయంలో ప్రభుత్వాలు సైతం వెనుకంజ వేస్తున్నాయి. 

ప్రభుత్వాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 14 వేలకు పైగా మైక్రో, మినీ గ్రిడ్స్‌..  20 లక్షల సోలార్‌ హోం సిస్టమ్స్‌కు ప్రాధాన్యత లేకుండా పోతోంది.

ఇంటింటికి కనెక్షన్‌లు ఇవ్వడం మరో సమస్యగా మారుతోంది.

చాలావరకు గ్రామపంచాయితీల్లో సోలార్‌ వెలుగులు కేవలం వీధి దీపాల వరకే పరిమితం అవుతున్నాయి.

ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే సోలార్‌ ప్లాంట్లు సైతం నిర్వహాణ భారంగా మారడం.. పలు కారణాలతో ఈ వ్యవస్థ విఫలం వైపు అడుగులేసింది.

చదవండి: రూ.15,519 కోట్ల చెల్లించిన ఎయిర్‌టెల్‌.. కారణం ఇదే

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top