లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్‌

Daily Stock Market Updates In Telugu November 24 - Sakshi

ముంబై: అమెరికాతో పాటు సింగపూర్‌ మార్కెట్‌లలో ఆశాజనకమైన పరిస్థితులు నెలకొనడంతో ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. గడిచిన ఐదు రోజులుగా నష్టాలతో కొట్టుమిట్టాడిన మార్కెట్లలోకి పెట్టుబడులు వస్తుండటంతో మార్కెట్‌ సూచీలు పైకి ఎగబాకేందుకు ప్రయత్నిస్తున్నాయి.

బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో సెన్సెక్స్‌ నిన్న సాయంత్రం 58,664 పాయింట్ల దగ్గర ముగిసింది. ఈ రోజు ఉదయం 175 పాయింట్లు లాభపడి 58,839 పాయింట్లతో మొదలైంది. ఉదయం 9:30 గంటల సమయానికి 131 పాయింట్ల లాభంతో 58,795 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 17,550 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top