గుర్నానీకి హైసియా పురస్కారం | Sakshi
Sakshi News home page

గుర్నానీకి హైసియా పురస్కారం

Published Thu, Feb 15 2024 4:30 AM

CP Gurnani gets Lifetime Achievement Award from HYSEA - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెక్‌ మహీంద్రా మాజీ సీఈవో, ఎండీ సి.పి.గుర్నానీ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైసెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. హైసియా 31వ జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.

2022–23 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో మొత్తం 36 కంపెనీలు, వ్యక్తులు హైసియా అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Advertisement
Advertisement