
2025 మార్చి 31కల్లా రూ. 425.38 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ తాజాగా 2025 మార్చి31 కల్లా రూ. 425.38 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైనట్లు వెల్లడించింది. వీటిలో అసలు, వడ్డీ కలసి ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలుసహా అన్‌లిస్టెడ్ రుణ సెక్యూరిటీలు(ఎన్‌సీడీ, ఎన్‌సీఆర్‌పీఎస్) ఉన్నట్లు తెలియజేసింది.
అసెట్ రిజల్యూషన్ ద్వారా రుణాలు తగ్గించుకుంటున్న కంపెనీ లిక్విడిటీ సంక్షోభం కారణంగా రుణ చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు వివరించింది. చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో రుణదాతలు లోన్ రీకాల్ నోటీసుల జారీతోపాటు.. చట్టపరమైన చర్యలు సైతం చేపడుతున్నట్లు పేర్కొంది. లోన్ రీకాల్ నోటీసులు, న్యాయ వివాదాలు, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పెండింగ్‌లో ఉండటం వంటి అంశాల కారణంగా 2021 ఏప్రిల్ నుంచి వడ్డీ మదింపు చేపట్టలేదని వెల్లడించింది.