5 లక్షల కంపెనీలు వ్యాపారం వదిలి వెళ్లిపోయాయ్‌

Central Minister Inderjit Singh Said That 5 Lakh Companies leave In Past Six Years - Sakshi

కొత్తగా 7 లక్షల కంపెనీలు వచ్చాయి: కేంద్రం

న్యూఢిల్లీ: గడిచిన ఆరేళ్ల కాలంలో నికరంగా 2 లక్షల కంపెనీలు దేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. కార్పొరేట్‌ శాఖ సహాయ మంత్రి రావు ఇందరజిత్‌సింగ్‌ లోక్‌సభకు సోమవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గడిచిన ఆరేళ్లలో 5,00,506 కంపెనీలు మూతపడ్డాయి. ఇదే సమయంలో 7,17,049 కంపెనీలు కంపెనీల చట్టం 2013 కింద కొత్తగా నమోదయ్యాయి. ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ సమాచారం ఇచ్చారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 22,557 కంపెనీలు మూతపడగా, 1,09,098 కంపెనీలు కొత్తగా నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం వారీగా చూస్తే.. 2016–17లో 12,808 కంపెనీలు, 2017–18లో 2,36,262 కంపెనీలు, 2018–19లో 1,43,233 కంపెనీలు, 2019–20లో 70,972 కంపెనీలు, 2020–21లో 14,674 కంపెనీలు మూతపడ్డాయి. 2018–19లో 1,23,938 కంపెనీలు, 2019–20లో 1,22,721 కంపెనీలు, 2020–21లో 1,55,377 కంపెనీలు కొత్తగా వచ్చాయి.    
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top