‘మిషన్‌ ఇ-వేస్ట్‌’ పేరుతో సెలెక్ట్‌ మొబైల్స్‌ వినూత్న కార్యక్రమం.. పాడైపోయిన ఎలక్ట్రానిక్‌ పరికరాలపై భారీ డిస్కౌంట్లు

Celekt Mobiles Launches Mission E-waste In Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ సెలెక్ట్‌ మొబైల్స్‌ భారత్‌లో తొలిసారిగా ‘మిషన్‌ ఈ–వేస్ట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పరిశుభ్ర వాతావరణాన్ని, జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ–వేస్ట్‌ను సేకరించి, రీసైక్లింగ్‌ చేపడతారు. ఇందుకోసం కంపెనీ స్టోర్లలో బిన్స్‌ను ఏర్పాటు చేస్తామని సెలెక్ట్‌ మొబైల్స్‌ సీఎండీ వై.గురు తెలిపారు.

పాడైన, వినియోగించని మొబైల్‌ ఫోన్లు, చార్జర్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌ను సెలెక్ట్‌ స్టోర్లకు తీసుకువస్తే చాలు. రూ.10,000 వరకు డిస్కౌంట్‌ కూపన్‌ అందుకోవచ్చు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల ఈ–వేస్ట్‌ పోగవుతోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.

వ్యర్థాల నిర్వహణ పెద్ద సవాల్‌గా మారిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో ఈ–వేస్ట్‌ నిర్వహణను తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. మొత్తం పరిశ్రమకు మిషన్‌ ఈ–వేస్ట్‌ ప్రేరణగా నిలుస్తుందని సెలెక్ట్‌ ఈడీ మురళి రేతినేని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top