
డీల్ విలువ రూ.28,250 కోట్లు
సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్‌వేస్ నెలకొల్పిన డబ్ల్యూఎన్‌ఎస్ చివరికి ఫ్రెంచ్ దిగ్గజం క్యాప్‌జెమిని చేతికి చిక్కింది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్(బీపీఎం) సంస్థ డబ్ల్యూఎన్‌ఎస్‌ను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్‌జెమిని సొంతం చేసుకోనుంది.
బీపీఎం రంగంలో భారీ డీల్‌కు తెరతీస్తూ టెక్నాలజీ సేవల గ్లోబల్ దిగ్గజం క్యాప్‌జెమిని.. డబ్ల్యూఎన్‌ఎస్‌ను కొనుగోలు చేస్తోంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఇది గురువారం ముగింపు(ఎన్‌వైఎస్‌ఈ) ధరతో పోలిస్తే 17 శాతం అధికంకాగా.. నెల రోజుల సగటు ధరతో చూస్తే 27 శాతం ప్రీమియం చెల్లిస్తోంది. ఇందుకు నగదు రూపేణా మొత్తం 3.3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. వెరసి బీపీఎం విభాగంలో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా ఇది నిలవనుంది. తాజా డీల్‌కు రెండు సంస్థల బోర్డులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు క్యాప్‌జెమిని వెల్లడించింది. రెండు కంపెనీలూ భారత్‌లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. తాజా కొనుగోలుతో తమ క్లయింట్లకు బిజినెస్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫార్మేషన్ కార్యకలాపాలను క్యాప్‌జెమిని.. మరింత సమర్థవంతంగా సమకూర్చగలుగుతుంది. సంప్రదాయ బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల నుంచి ఆధునిక ఏఐ ఆధారిత మేథో కార్యకలాపాలను క్యాప్‌జెమిని అందించగలుగుతుంది.
ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్
డబ్ల్యూఎన్‌ఎస్ నేపథ్యమిదీ...
1999లో బ్రిటిష్ ఎయిర్‌వేస్ ముంబైలో సొంత అవసరాల కోసం డబ్ల్యూఎన్‌ఎస్‌ను నెలకొలి్పంది. పుణేలో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 2002లో వార్‌బర్గ్ పింకస్ 40 కోట్ల డాలర్లకు మెజారిటీ వాటా కొనుగోలు చేసి కంపెనీ పేరును డబ్ల్యూఎన్‌ఎస్‌గా మార్చింది. 2006లో ఎన్‌వైఎస్‌ఈలో లిస్ట్ చేసింది. 2013లో వార్‌బర్గ్ పింకస్ 19.2 కోట్ల డాలర్లకు డబ్ల్యూఎన్‌ఎస్‌ను విక్రయించింది. కంపెనీ ప్రధానంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్‌తోపాటు.. డేటా అనలిటిక్స్ సర్వీసులు అందిస్తోంది. 2025లో 1.27 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది.