కెనరా బ్యాంక్‌ వడ్డీరేటు పెంపు | Canara Bank raises MCLR by 10 basis points | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంక్‌ వడ్డీరేటు పెంపు

Jul 7 2022 1:16 AM | Updated on Jul 7 2022 1:16 AM

Canara Bank raises MCLR by 10 basis points - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 10 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. గురువారం నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.50 శాతానికి పెరిగింది.

ఓవర్‌నైట్‌ నుంచి ఆరు నెలల కాలాలకు సంబంధించి కొత్త రేట్లు 6.75 శాతం నుంచి 7.45 శాతం శ్రేణిలో ఉన్నాయి. రెపో ఆధారిత రుణ రేటును  7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్లు కూడా బ్యాంక్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement