మీ ఫోన్‌లో నుంచి ఈ యాప్ వెంటనే తొలగించండి.. ముఖ్యంగా మహిళలు

Bug In Dating App Bumble Reveals Users Location Data - Sakshi

ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ లో ఉన్న ఒక సెక్యూరిటీ బగ్ వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని బహిర్గతం చేస్తున్నట్లు ఒక భద్రతా పరిశోధకుడు పేర్కొన్నారు. ఈ బంబుల్ యాప్ లో ఉన్న లోపం ద్వారా హ్యకర్లు దాడి చేసి వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బంబుల్ యాప్ ను ఇప్పటి వరకు కోటి మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర డేటింగ్ యాప్స్ కంటే ఈ డేటింగ్ యాప్ సురక్షితం అని మహిళా యూజర్స్ భావిస్తున్నారు. ఎందుకంటే, వారి అనుమతి లేకుండా ఏ పురుషుడు వారికి మెసేజ్ పంపలేరు. 

అయితే, తాజాగా ఈ బగ్ బయటపడటంతో మహిళా వినియోగదారులకు ఎక్కువగా హాని కలిగే అవకాశం ఉంది. స్ట్రైప్ సంస్థలో పనిచేసే పరిశోధకులు రాబర్ట్ హీటన్, బంబుల్ యాప్స్ లో ఉన్న బగ్ ను కనుగొన్నారు. ఈ లోపం వల్ల వినియోగదారుల ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఒక బ్లాగ్ పోస్ట్ లో నివేదించారు. ఇందుకు గాను అతనికి $2,000 బహుమతి కూడా లభించింది. సైబర్ క్రిమినల్స్  వినియోగదారుల ఖచ్చితమైన ఇంటి చిరునామాను తెలుసుకోవడానికి, వారి కదలికలను ట్రాక్ చేయడానికి వారు బంబుల్ యాప్ ఉపయోగించేకునే అవకాశం ఉంది అని హీటన్ పేర్కొన్నారు. అందుకే ఈ యాప్ ఉన్న యూజర్లు వెంటనే మీ ఫోన్ నుంచి తొలగించాలని భద్రత నిపుణులు పేర్కొన్నారు.(చదవండి: పీఎంజేడీవై ఖాతాదారులకు తీపికబురు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top