
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ క్వాంటమ్ 5జీ నెట్‌వర్క్ కింద వాణిజ్య 5జీ సేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇవి తాజాగా 90,000 లను దాటాయి. ఈ మైలురాయిని పురస్కరించుకుని బీఎస్ఎన్ఎల్ తమ వినియోగదారుల కోసం పరిమిత కాల ప్రమోషనల్ "ఫ్లాష్ సేల్"ను ప్రకటించింది.
బీఎస్‌ఎన్‌ఎల్ "ఫ్లాష్ సేల్"లో భాగంగా 400 జీబీ హైస్పీడ్ 4జీ డేటాను రూ.400లకే అందిస్తోంది. అంటే ఒక జీబీకి ఒక రూపాయి మాత్రమే అన్నమాట. దీనికి 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.400 ప్రత్యేక డేటా రీఛార్జ్ ప్యాక్ జూన్ 28 నుంచి అందుబాటులోకి వచ్చింది. జూలై 1 వరకు కొనసాగుతుంది. ఇది డేటా రీచార్జ్ కాబట్టి యూజర్లు ఇప్పటికే ఉన్న ప్లాన్‌తో కలిపి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. కేవలం 400 జీబీ డేటా మాత్రమే లభిస్తుందని, 400 జీబీ తర్వాత స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
BSNL celebrates the milestone of 90,000 towers with a limited-time Flash Sale.
Get 400GB for just ₹400, with 40 days validity.
Tomorrow is the last day to benefit from this offer.
Experience trusted, nationwide connectivity with BSNL.
Recharge Now - https://t.co/yDeFrwK5vt… pic.twitter.com/lz7Kv4iKlm— BSNL India (@BSNLCorporate) June 30, 2025