జియో కొత్త ప్లాన్‌ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ | Reliance Jio introduced cheapest plan for 28 days | Sakshi
Sakshi News home page

జియో కొత్త ప్లాన్‌ వచ్చింది.. చవగ్గా 28 రోజులు వ్యాలిడిటీ

Aug 14 2025 9:31 PM | Updated on Aug 14 2025 9:33 PM

Reliance Jio introduced cheapest plan for 28 days

రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ పోర్ట్‌ఫోలియోకు కొత్త, చాలా తక్కువ ధర ప్లాన్‌ను జోడించింది. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది. రూ.189 విలువైన ఈ ప్లాన్లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 2 జీబీ హైస్పీడ్ డేటా, 300 ఉచిత ఎస్ఎంఎస్‌లు 28 రోజుల పాటు లభిస్తాయి. తక్కువ ఖర్చుతో నెలంతా ఫోన్ యాక్టివ్ గా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.

ఈ జియో ప్లాన్ అన్‌లిమిటెడ్‌ కాలింగ్, తక్కువ డేటా ఉపయోగించేవారికి మాత్రమే కాకుండా, ఓటీటీ కంటెంట్ ఇష్టపడేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. అంటే వినోదం, డిజిటల్ స్టోరేజ్ అవసరాలను కూడా తీరుస్తుందన్న మాట.

సెకండరీ సిమ్ ఉన్న లేదా తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే కస్టమర్ల కోసం ఈ వాల్యూ ప్యాక్ ప్రత్యేకంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ కేవలం రూ.189కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. రూ.189తో 28 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement