రూ. 299తో 35జీబీ డేటా: ఉచితంగా జియోఫై డివైజ్ | Reliance Jio Introduces 35GB data And free JioFi Device for Only Rs 299 | Sakshi
Sakshi News home page

రూ. 299తో 35జీబీ డేటా: ఉచితంగా జియోఫై డివైజ్

Oct 27 2025 6:00 PM | Updated on Oct 27 2025 7:33 PM

Reliance Jio Introduces 35GB data And free JioFi Device for Only Rs 299

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. ఎప్పటికప్పుడు తన కస్టమర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉంది. కాగా ఇప్పుడు చిన్న & మధ్య తరహా వ్యాపారాల (SMEs) కోసం కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. దీనికి 'కార్పొరేట్ జియోఫై' అని పేరు పెట్టింది. ఈ ప్లాన్ నెలకు కేవలం రూ. 299 నుంచి ప్రారంభమవుతుంది. అంతే కాకుండా జియోఫై డివైజ్ కూడా పూర్తిగా ఉచితం.

కార్పొరేట్ కనెక్టివిటీ మార్కెట్‌లో జియో తన వాటాను మరింత పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఈ ప్లాన్‌ తీసుకొచ్చింది. దీనికోసం కంపెనీ జియోఫై పరికరాన్ని ఉచితంగా ఇస్తుంది. దీనిని ఉపయోగించిన తరువాత.. తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది.

కార్పొరేట్ జియోఫైలో రూటర్ M2S బ్లాక్ పరికరం, ఒక చిన్న వై-ఫై యూనిట్ ఉంటాయి. ఇది 2300/1800/850 MHz బ్యాండ్‌లలో 4G LTEకు సపోర్ట్ చేస్తుంది. ఈ చిన్న వైఫై యూనిట్ ద్వారా.. 10 వైఫై పరికరాలు, ఒక USB డివైజును కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులోని 2300 mAh బ్యాటరీ 5-6 గంటలు ఇంటర్నెట్ వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇది జియోకాల్ యాప్, ఫైల్ షేరింగ్, వన్-టచ్ WPS సెటప్ వంటి ఫీచర్స్ కూడా పొందుతుంది.

ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: హై-స్పీడ్ డేటా, ఫ్రీ కాలింగ్స్

కార్పొరేట్ జియోఫై ప్లాన్‌లు

  • రూ. 299: నెలరోజులు 35 GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు

  • రూ. 349: నెలరోజులు 50 GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు

  • రూ. 399: నెలరోజులు 65 GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement