అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ ఉపయోగించే.. 18-25 సంవత్సరాల వయసు కలిగిన జియో వినియోగదారులు 18 నెలల పాటు రూ.35,100 విలువైన గూగుల్ జెమిని AI ప్రో సేవను ఉచితంగా పొందవచ్చు. దీనికోసం రిలయన్స్ కంపెనీ.. గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో ఏఐ స్వీకరణను వేగవంతం చేయడానికి.. యువ సబ్‌స్క్రైబర్‌లకు గూగుల్ జెమినీ AI ప్రోను ఉచితంగా అందించడానికి కంపెనీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఇది అక్టోబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే.. అర్హత కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లపై గూగుల్ AI ప్రో ఉచితంగా పొందవచ్చు. ఇది అపరిమిత చాట్, 2TB క్లౌడ్ స్టోరేజ్, Veo 3.1 లో వీడియో జనరేషన్, నానో బనానాతో ఇమేజ్ జనరేషన్ వంటివెన్నో అందిస్తుంది.
రూ. 349 నుంచి ప్రారంభమయ్యే 5జీ అన్‌లిమిటెడ్ ప్లాన్‌లకు (ప్రీపెయిడ్ & పోస్ట్‌పెయిడ్) ఉచిత జెమినీ ప్రో లభిస్తుంది. ఇది యాక్టివేషన్ చేసుకున్న రోజు నుంచి 18 నెలల వరకు అందుబాటులో ఉంటుంది (అపరిమిత 5G ప్లాన్ యాక్టివ్‌లో ఉండాలి). యువ భారతీయులలో సృజనాత్మకత, విద్య & ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు కంపెనీ దీనిని ప్రత్యేకంగా రూపొందించింది. దీనిని మైజియో యాప్ ద్వారా నేరుగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
1.45 బిలియన్ భారతీయులకు ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రిలయన్స్ ఇంటెలిజెన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. గూగుల్ వంటి వ్యూహాత్మక & దీర్ఘకాలిక భాగస్వాములతో మా సహకారం ద్వారా, భారతదేశాన్ని అల్-ఎనేబుల్డ్ కాకుండా అల్-ఎంపవర్డ్ గా మార్చాలని ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
FREE BENEFITS WORTH ₹35,100 🎉
FREE pro plan of Google Gemini for 18-months (worth ₹35,100) for Jio users aged 18–25 years (early access) using an eligible Unlimited 5G plan.
Enjoy unlimited chats, 2TB cloud storage, video generation on Veo 3.1, image generation with Nano… pic.twitter.com/O5Pqpo2K4r— Reliance Jio (@reliancejio) October 30, 2025


