
విజయవంతంగా.. లాభాలను గడిస్తూ దూసుకెళ్తున్న కంపెనీ, బ్రాండ్ పేరులోని చిన్న పదాన్ని తొలగించడం వల్ల ఊహకందని నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వినడానికి ఈ మాట కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత దశాబ్దంలో విజయవంతమైన స్టార్టప్ సంస్థల్లో బిరా 91 ఒకటి. ఇది ఒక ప్రసిద్ధ క్రాఫ్ట్ బీర్ బ్రాండ్. 2023 చివరలో ఈ కంపెనీ ఐపీఓ కోసం సిద్ధమైంది. అయితే లిస్టింగ్ నిబంధనలను పాటించడానికి.. బీ9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిరా 91 మాతృ సంస్థ) నుంచి ప్రైవేట్ అనే పదాన్ని తొలగించి.. బీ9 బెవరేజెస్ లిమిటెడ్‌గా పేరు మార్చుకుంది. దీని కోసం 2024 జనవరిలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద పేరును మార్చుకుంది. ఈ చర్య కంపెనీ నష్టాల్లోకి కూరుకుపోయేలా చేసేసింది.
కంపెనీ కొత్త పేరుతో తెరమీదకు రావడంతో.. అన్ని రాష్ట్రాల్లో బిరా 91 అమ్మకాలను చాలామంది నిషేధించారు. దీనికి కారణం కొత్త పేరు.. పాత కంపెనీదే అని నమ్మకపోవడం. అమ్మకం దారులు ప్రతి ఒక్క వేరియంట్‌కు కొత్త చట్టపరమైన ఆమోదాలు, లేబుల్ ఆమోదాలు, ఉత్పత్తి రిజిస్ట్రేషన్లు, కొత్త లైసెన్స్‌లను డిమాండ్ చేశారు. వీటిని జారీ చేయడంలో అధికారిక జాప్యం కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఒకదాని తర్వాత ఒకటి సమస్యలకు దారితీసింది. దీంతో పంపిణీ మొత్తం ఆగిపోయింది. కోట్ల విలువైన ఉత్పత్తి.. గిడ్డంగుల్లోనే ఉండిపోయింది. మొత్తం మీద కంపెనీ రూ. 700 కోట్ల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఉత్పత్తి కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇందులో పెట్టుబడిపెట్టడానికి వచ్చిన సంస్థలు కూడా వెనుకడుగు వేశాయి.
Bira 91 was one of the successful start-up stories of last decade. It is a popular craft beer brand. They were growing so well. Reality is strange than what you can imagine. A procedural goof up has lead to whole company being collapsing and the founder now being forced even to…
— D.Muthukrishnan (@dmuthuk) October 10, 2025