ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్.. తన వినియోగదారుల కోసం కొత్తగా రూ.348 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?, రోజువారీ డేటా? వంటివి మాత్రమే కాకుండా.. ఇతర సదుపాయాలు ఏమైనా లభిస్తాయా? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతీ ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్ (రూ.348) వ్యాలిడిటీ.. 28 రోజులు. ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాలు లభిస్తాయి. వీటితో పాటు ఏడాది పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. సాధారణంగా ఈ సబ్‌స్క్రిప్షన్ కోసం చెల్లించాల్సిన మొత్తంతో పోలిస్తే, వినియోగదారులకు రూ.4 వేల వరకు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ఫొటోలు, పోస్టర్లు, సోషల్ మీడియా డిజైన్లు రూపొందించుకోవాలనుకునే వారికి ఈ ప్రయోజనం ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్ సదుపాయాలతో పాటు భద్రతకు సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. స్పామ్ కాల్స్ గురించి అలర్ట్‌లు రావడంతో పాటు.. మోసపూరిత లింకులను బ్లాక్ చేసే సదుపాయాలు లభిస్తాయని ఎయిర్‌టెల్ పేర్కొంది. అంతేకాకుండా.. 30 రోజుల పాటు ఉచితంగా హలోట్యూన్స్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. దీంతో తక్కువ ధరలో రోజువారీ మొబైల్ అవసరాలను తీర్చుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.
ఇదీ చదవండి: 2026 రేడియాన్ బైక్ లాంచ్.. రూ.67000 మాత్రమే!


