బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్‌.. రేటు ఎంతంటే?

Bentley Motors On Tuesday Launched New Version Of Bentayga SUV - Sakshi

న్యూఢిల్లీ:  బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ బెంట్లీ మోటార్స్ మంగళవారం దేశీయ మార్కెట్లోకి బెంటేగా కొత్త వెర్షన్‌ రిలీజ్‌ చేసింది. బెంట్లీ నుంచి వచ్చిన మొదటి సూపర్‌ యూటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) బెంటెగా కావడం విశేషం.  ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బెంట్లీ లగ్జరీ ఎస్‌యూవీ కారు.  2015లో ఈ కారును లాంచ్‌ చేయగా, ప్రస్తుతం ఈ  బెంటేగా ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ (ఢిల్లీ) ధర రూ .4.10 కోట్లుగా  కంపెనీ  నిర్ణయించింది.

బెంట్లీ  కంపెనీ  న్యూ  బియాండ్ 100 బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా రూపొందించారు. ఈ ఎస్‌యూవీ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. 10.9 అంగుళాల స్క్రీన్, సూపర్-హై-రిజల్యూషన్ గ్రాఫిక్స్ కలిగిన నెక్స్‌ట్‌ జనరేషన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు హైకనెక్టివిటీతో పనిచేస్తుందని  ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది.

కొత్త బెంటేగా వర్షన్‌ను భారతీయ కస్టమర్లకు ముందుకు తీసుకురావటం సంతోషంగా ఉందని అధికారిక బెంట్లీ మోటార్స్ డీలర్‌షిప్ ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాగ్లా తెలిపారు. బెంట్లీ 100 సంవత్సరాలకు పైగా ఆటోమోటివ్‌ లగ్జరీ కార్ల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ఈ సరికొత్త డిజైన్‌తో వెనుక భాగం లెగ్‌రూమ్‌ ఎక్కువగా పెరిగింది. ఫ్రంట్‌ అండ్‌ రియర్‌ కొత్త డిజైన్లు బెంట్లీ డీఎన్‌ఎను కొనసాగిస్తోంది. కొత్త బెంటెగాలో ఎంబెడెడ్ సిమ్‌ను ఉపయోగించడంతో మై బెంట్లీ కనెక్ట్  సేవలను ఈజీగా పొందవచ్చు.  అలాగే పాత వర్షన్‌లో ఉన్న వైర్‌లెస్‌ ఆపిల్‌తో పాటుగా ఆండ్రాయిడ్‌ ఆటోతో కూడా రానుంది. (చదవండి: ఆల్‌న్యూ క్రెటా అమ్మకాల జోరు)


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top