సిక్‌ లీవ్‌ పెట్టి కూర్గ్‌లో ఎంజాయ్‌... ఎలా దొరికాడో చూడండి.. | Bengaluru employee takes Friday sick leave to chill at Coorg Gets caught | Sakshi
Sakshi News home page

సిక్‌ లీవ్‌ పెట్టి కూర్గ్‌లో ఎంజాయ్‌... ఎలా దొరికాడో చూడండి..

May 29 2025 2:01 PM | Updated on May 29 2025 2:46 PM

Bengaluru employee takes Friday sick leave to chill at Coorg Gets caught

సాధారణంగా వీకెండ్‌ ఎప్పడొస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తుంటారు. ఆ వీకెండ్‌కు ముందో.. వెనకో మరో సెలవు తోడైతే ఎక్కడికైనా ట్రిప్‌ వేసి ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. కానీ కొందరైతే ఇందుకోసం సిక్‌ లీవ్‌లను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాగే బెంగళూరుకు చెందిన ఓ ఉద్యోగి కూడా ఎక్కువ రోజులు వారాంతాన్ని ఆస్వాదించేందుకు సిక్‌ లీవ్‌ పేరుతో నాటకమాడాడు. కానీ దొరికిపోయాడు. అతను ఎలా దొరికిపోయాడు.. ఆ తర్వాత ఏమైంది.. చదవండి...

తన వీకెండ్‌ ట్రిప్‌ గురించి ఓ  రెడిట్ యూజర్ ఇటీవల ఒక పోస్ట్‌ పెట్టాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి శుక్రవారం  సిక్‌ లీవ్‌ పెట్టి  స్నేహితులతో కలిసి కూర్గ్‌ వెళ్లాడు. అక్కడ వీకెండ్‌ అంతా ఎంజాయ్‌ చేసి సోమవారం ఏమీ తెలియనట్టుగా తిరిగి విధుల్లో చేరాడు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయిన ఓ వీడియో అతన్ని పట్టించింది.  ‘గత నెలలో శుక్రవారం సెలవు పెట్టి కూర్గ్‌ వెళ్లాను. కడుపులో ఇన్‌ఫెక్షన్‌ (స్టమక్‌ ఫ్లూ) అని మా మేనేజర్‌కు చెప్పాను. అక్కడ హోమ్‌ స్టేలో ఓ వ్యక్తి డ్యాన్స్‌ చేసిన వీడియో రీల్‌ వైరల్‌ అయింది. అందులో బ్యాక్‌గ్రౌండ్‌లో నేనున్నాను. అలా దొరికిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

తర్వాత ఏమైందంటే..
‘సోమవారం మా స్కిప్‌  లెవల్ మేనేజర్ ఓ రీల్‌ లింక్‌ పంపించారు. ‘ఇప్పుడు నీ కడుపులో ఇన్‌ఫెక్షన్‌ బాగైందనుకుంటాను’ అని దానికి జోడించారు. సిక్‌ లీవ్‌ ఫేక్‌ చేసి అలా దొరికిపోయాను. దేవుడి దయ వల్ల ఉద్యోగం పోలేదు. కానీ అప్పటి నుండి ఒక్క వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రిక్వెస్ట్‌  కూడా అప్రూవ్‌ చేయలేదు. ఇప్పుడు ఆయన నన్ను నమ్మడం లేదు' అని ఆ పోస్టులో పేర్కొన్నారు. వైరల్‌గా మారిన ఈ రెడిట్‌ పోస్ట్‌కు యూజర్లు విశేషంగా ప్రతిస్పందించారు. ‘భలే నవ్వు తెప్పిస్తోంది’.. అని ఒకరు కామెంట్‌ చేయగా ‘వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌  డిలీట్‌ చేసేయాలి’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement