ఖాతాదారులకు అలర్ట్, సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఎన్నిరోజులు సెలవులంటే!

Bank Holidays In September 2022 - Sakshi

ఆర్బీఐ ప్రతినెల బ్యాంక్‌ హాలిడేస్‌ను ప్రకటిస్తుంది. సెప్టెంబర్‌ నెలలో సైతం బ్యాంక్‌లకు ఎన్ని రోజులు సెలవులనేది అంశంపై స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్‌లో రెండు, నాలుగో శనివారం, ఆదివారాలతో సహా 13 రోజుల పాటు దేశంలోని బ్యాంకులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకారం, సెప్టెంబర్లో వారాంతాలు కాకుండా 8 రోజులు బ్యాంకుకు సెలవులని పేర్కొంది. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాల్ని బట్టి మారుతుంటాయని, బ్యాంక్‌ ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తించాలని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. 
 
సెప్టెంబర్‌లో రాష్ట్రాల వారీగా గణేష్ చతుర్థి, కర్మ పూజ, మొదటి ఓనం, తిరువోణం, ఇంద్రజాతర, శ్రీ నారాయణ గురు జయంతి వంటి ఇతర సందర్భాల్లో బ్యాంకులకు హాలిడేస్‌ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం సెప్టెంబర్‌ నెలలో దేశ వ్యాప్తంగా ఎన్నిరోజులు సెలవులున్నాయో తెలుసుకుందాం.  
 
సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు  

సెప్టెంబర్ 1, 2022 (గురువారం): గణేష్ చతుర్థి (2వ రోజు) - పనాజీ

సెప్టెంబర్ 6, 2022 (మంగళవారం): కర్మ పూజ - రాంచీ

సెప్టెంబర్ 7, 2022 (బుధవారం): మొదటి ఓనం - కొచ్చి, తిరువనంతపురం

సెప్టెంబర్ 8, 2022 (గురువారం): తిరువోణం - కొచ్చి, తిరువనంతపురం

సెప్టెంబర్ 9, 2022 (శుక్రవారం): ఇంద్రజాతర - గ్యాంగ్టక్

సెప్టెంబర్ 10, 2022 (శనివారం): శ్రీ నారాయణ గురు జయంతి - కొచ్చి, తిరువనంతపురం

సెప్టెంబర్ 21, 2022 (బుధవారం): శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం - కొచ్చి, తిరువనంతపురం

సెప్టెంబర్ 26, 2022 (సోమవారం): నవరాత్రి స్తాప్నా / మేరా చౌరెన్ హౌబా ఆఫ్ లైనింగ్తౌ సనమహి - ఇంఫాల్, జైపూర్

సెప్టెంబర్ 2022లో వారాంతపు సెలవులు:

సెప్టెంబర్ 4, 2022: ఆదివారం

సెప్టెంబర్ 10, 2022: రెండో శనివారం

సెప్టెంబర్ 11, 2022: ఆదివారం

సెప్టెంబర్ 18, 2022: ఆదివారం

సెప్టెంబర్ 24, 2022: నాలుగో శనివారం

సెప్టెంబర్ 25, 2022: ఆదివారం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top