మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీ.. కేం‍ద్రం ఏం చెప్పిందంటే?

Bank Boards Decide On Waiving Penalty On Minimum Balance Customer Accounts - Sakshi

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్‌ను కలిగి ఉన్నారు. ఇక ఉద్యోగులు, వ్యాపారస్తులు ఏకంగా రెండు పైనే ఖాతాలను నిర్వహిస్తున్నారు. కొందరు బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో మినిమం బ్యాలెన్స్ (కనీస మొత్తంలో నగదు) నిల్వ చేయలేక  జరిమానాలు, అదనపు ఛార్జీలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బ్యాంక్ అకౌంట్‌లో ఇక మినిమం బ్యాలెన్స్‌ జరిమానాలపై తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్‌రావ్ కారడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.                                                                       

మినిమం బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాలపై పెనాల్టీని మాఫీ చేయడంపై వ్యక్తిగత బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చని కారడ్‌ తెలిపారు. ‘బ్యాంకులు స్వతంత్ర సంస్థలు. పెనాల్టీని రద్దు చేసే నిర్ణయం తీసుకునే అధికారం బోర్డులకు ఉన్నాయని’ అన్నారు. బ్యాంక్‌ రూల్స్‌ ప్రకారం తక్కువ నిల్వ (మినిమం బ్యాలెన్స్‌) ఉన్న ఖాతాలపై జరిమాన విధిస్తున్న విషయం విదితమే.

అయితే ఇలాంటి అకౌంట్లపై ఎలాంటి పెనాల్టీ వసూలు చేయవద్దని బ్యాంకులను ఆదేశించడంపై కేంద్రం పరిశీలిస్తుందా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లో క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి 58 శాతంగా ఉందని, దానిని పెంచాలని అధికారులను కోరినట్లు కారడ్‌ తెలిపారు. అయితే ఇక్కడ క్లిష్టమైన భూభాగాలు ఉన్నప్పటికీ, జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకు కమ్యూనికేషన్ లేని ఒక్క గ్రామం కూడా లేదని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

చదవండి: ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top