
బజాజ్ ఫిన్‌సర్వ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ చోటాసిప్‌ను తీసుకువచ్చే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. ఇందులో సాధ్యా సాధ్యాలను అంచనా వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కంపెనీ ఎండీ గణేష్ మోహన్ తెలిపారు. ఈ దిశగా టెక్నాలజీ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం..
చోటాసిప్ అన్నది ఆసక్తికరమైన చొరవగా గణేష్ మోహన్ పేర్కొన్నారు. తగినంత అధ్యయనం అనంతరం దీన్ని ప్రారంభించేందుకు ఆరు నెలల సమయం తీసుకుంటుందన్నారు. ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలుగా సెబీ ఈ ఏడాది ఆరంభంలో మైక్రోసిప్‌ను ఆవిష్కరించడం గమనార్హం. ఎస్‌బీఐ, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ ఇప్పటికే రూ.100 సిప్‌ను అందిస్తున్నాయి. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో అయితే కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.