Bajaj Chetak Electric Scooter Will Launch In Hyderabad Soon- Sakshi
Sakshi News home page

చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, హైదరాబాద్‌లో అమ్మకాలు ఎప్పుడంటే ?

Jul 10 2021 2:31 PM | Updated on Jul 10 2021 4:55 PM

Bajaj Electric Scooter Will Launch In Hyderabad Soon - Sakshi

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని ప్రవేశ పెట్టేందుకు బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ సిద్ధమైంది. ఇప్పటికే నాగ్‌పూర్‌లో చేతక్‌ ఈవీ షోరూమ్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నాగ్‌పూర్‌ తర్వాత చెన్నై, హైదరాబాద్‌లలో తమ స్కూటర్‌ తెచ్చేలా బజాజ్‌ ప్లాన్‌ చేస్తోంది.

రెండు వేరియంట్లు
ప్రస్తుతం బజాజ్‌ చేతక్‌ అర్బన్‌, ప్రీమియం వేరియంట్లలో లభిస్తోంది. షోరూమ్‌ ప్రకారం అర్బన్‌ ధర రూ. 1.42,620 ఉండగా ప్రీమియం ధర రూ. 1,44,620గా ఉంది.  ఇందులో 2 కిలోవీట్‌ బ్యాటరీలు అమర్చారు.బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీ అందిస్తున్నారు.ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే మోడ్‌ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు.

సోల్డ్‌ అవుట్‌
బజాజ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలకు మార్కెట్‌లో మంచి స్పందన వస్తోంది. మార్కెట్‌లోకి రాకముందే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌లోనే బైకులన్నీ అమ్ముడై పోతున్నాయి. తాజాగా నాగ్‌పూర్‌కి సంబంధించిన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ మొదలైంది. 

90వ దశకంలో
90వ దశకంలో స్కూటర్‌ విభాగంలో చేతక్‌ ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత బైకుల అమ్మకాలు పెరగగా చేతక్‌ స్కూటర్‌ అమ్మకాలు పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు క్రమంగా ఊపందుకోవడంతో చేతక్‌ ఈవీని మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమైంది బజాజ్‌. 2021 మార్చిలో ఒకేసారి 30 నగరాల్లో చేతక్‌ అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయించినా... తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. క్రమంగా ఒక్కో సిటీలో బజాజ్‌ షోరూమ్స్‌ ప్రారంభిస్తూ పోతుంది.

ఇక్కడే
ప్రస్తుతం పూనే, బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్‌ నగరాల్లో చేతక్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు అమ్మకాలు సాగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో నాగ్‌పూర్‌ చేరనుంది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌లో కూడా పరుగులు పెట్టనుంది చేతక్‌.
 

Advertisement
 
Advertisement
Advertisement