
ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ కరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది తక్కువ సమయంలో ఎక్కువ అమ్మకాలు కంపెనీల జాబితాలో బజాజ్ ఆటో అగ్రస్థానంలో నిలిచింది. ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో (మార్చి 1, ఉదయం 7 గంటల నాటికి) అందుబాటులో ఉన్న సేల్స్ డేటా ప్రకారం.. 21,335 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో, 'బజాజ్ చేతక్' 81 శాతం బలమైన వృద్ధిని నమోదు చేసింది.
ఏప్రిల్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 10,18,300 ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, మోపెడ్‌ల మొత్తం రిటైల్ అమ్మకాలతో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగం ఒక ఆర్ధిక సంవత్సరంలో మొదటిసారి.. 10 లక్షల యూనిట్ల అమ్మకాలను దాటేసింది. ఈ అమ్మకాలు అంతకుముందు ఆర్ధిక సంవత్సరం కంటే 7 శాతం ఎక్కువ. ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీల జాబితాలో.. బజాజ్, టీవీఎస్, ఏథర్ ఎనర్జీ, మొదలైనవి ఉన్నాయి.
ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీలు
➤బజాజ్ ఆటో: 21,335 యూనిట్లు
➤టీవీఎస్ మోటార్ : 18,746 యూనిట్లు
➤ఏథర్ ఎనర్జీ: 11,788 యూనిట్లు
➤ఓలా ఎలక్ట్రిక్: 8,647 యూనిట్లు
➤గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ: 3,700 యూనిట్లు
➤విడా (హీరో మోటోకార్ప్): 2,677 యూనిట్లు
ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా