అతిపెద్ద ఆటో ఎక్స్‌పో వాయిదా

Auto Expo 2022 postponed due to COVID-19 - Sakshi

న్యూఢిల్లీ: థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరిగే ఆటో ఎక్స్‌పో వాయిదా పడింది. రెండేళ్లకోసారి ఈ వాహన ప్రదర్శన జరుగుతుంది. ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తారని, సామాజిక దూరం నిర్వహణ క్లిష్టమవుతుందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది.

కోవిడ్‌–19 పరిస్థితులను ఆధారంగా చేసుకుని కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేదీ ఈ ఏడాది చివరికల్లా నిర్ణయిస్తామని వివరించింది. 2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోను ఆరులక్షల పైచిలుకు మంది సందర్శించారు. 70 దాకా కొత్త మోడళ్లను కంపెనీలు ఆవిష్కరించాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top