Apple Might Launch the iPhone 14 Series on September 13, Reports Says - Sakshi
Sakshi News home page

iPhone 14: ఐఫోన్‌ లవర్స్‌కు తీపికబురు

Jul 11 2022 4:43 PM | Updated on Jul 11 2022 6:30 PM

Apple might launch the iPhone 14 series on September 13: Reports - Sakshi

 సాక్షి, ముంబై:  ఆపిల్‌ ఐఫోన్‌  లవర్స్‌కు తీపి  కబురు అందింది.  ఎన్నాళ్లోనుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 14 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 13న లాంచ్‌ కానుంది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పలు నివేదికలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.  తాజా నివేదికల ప్రకార ఐఫోన్‌ 14 సిరీస్‌ను సెప్టెంబర్ 13న లాంచ్ చేయబోతోంది. ప్రీఆర్డర్‌లు సెప్టెంబర్16 నుండి ప్రారంభమవుతాయని,సెప్టెంబరు 23నాటికి షిప్‌మెంట్‌లు ప్రారంభం కానున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆపిల్‌ అధికారికంగా ఈ తేదీలను ధృవీకరించలేదు.

ఈ సెప్టెంబరులో ఆపిల్‌ వాచ్ సిరీస్ 8తో పాటు ఐఫోన్‌ 14 సిరీస్‌ను, AirPods ప్రోను లాంచ్‌ చేయనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మాక్స్‌ అనే న ఆలుగు వేరియంట్లలో తీసుకురానుంది.  ఐఫోన్ 13తో పోలిస్తే ఐఫోన్ 14  ధన 100 డాలర్లు ఖరీదైనదిగా ఉండనుందట. అయితే ఆపిల్‌ అధికారికంగా ఈ తేదీలను ధృవీకరించలేదు. కొత్త ఐఫోన్‌ను, ఇతర ఉత్పత్తులను సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబరులో  నిర్వహించే  స్పెషల్‌ ఈవెంట్‌లో  లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement