ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు! | Apple iPhone 15 And ISRO's NavIC Technology Connection | Sakshi
Sakshi News home page

ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి? తెలిస్తే అవాక్కవుతారు!

Sep 15 2023 11:47 AM | Updated on Sep 15 2023 12:18 PM

Apple iPhone 15 And ISRO's NavIC Technology Connection - Sakshi

యాపిల్ లవర్స్ అందరూ ఎంతాగానే ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'ఐఫోన్ 15 సిరీస్' ఎట్టకేలకు విడుదలైంది. అయితే ఈ ఐఫోన్‌కు 'ఇస్రో'కి కనెక్షన్ ఉన్నట్లు చాలామందికి తెలియక పోవచ్చు. ఈ కథనంలో ఈ సంబంధం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌ ఇస్రో రూపొందించిన జీపీఎస్ సిస్టమ్ NavIC (న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌)కు సపోర్ట్ చేస్తాయి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ యాపిల్ తన ఐఫోన్ మోడల్స్‌లో తీసుకురావడం ఇదే మొదటిసారి. ఈ ఫీచర్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రెండింటిలోనూ ఉంటుంది.

NavIC గురించి..
'న్యావిగేషన్ విత్ ఇండియన్ కన్‌స్టెలేషన్‌'ని గతంలో ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) అని పిలిచేవారు. ఇది ఏడు ఉపగ్రహాల సమూహం ద్వారా సేకరించిన సమాచారం ద్వారా పనిచేస్తుంది. కావున భారతదేశపు మొత్తం భూభాగాన్ని కవర్ చేస్తుంది. అంతే కాకుండా జీపీఎస్ కంటే కూడా మంచి ఫలితాలను ఇస్తుందని సమాచారం. మొత్తం మీద దీని ద్వారా లొకేషన్ ట్రాకింగ్ కెపాసిటీ మరింత మెరుగుపడుతుందని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. నేడు ముఖేష్ అంబానీకంటే ఎక్కువ కార్లు కలిగిన బార్బర్

NavIC అనేది ISRO స్వతంత్రంగా అభివృద్ధి చేసింది. నిజానికి ఇది 2008లో 174 మిలియన్ డాలర్స్ లేదా రూ. 1426 కోట్లతో కార్య రూపం దాల్చి 2011 చివరికి పూర్తయింది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) రూపొందించిన నావిక్ శాటిలైట్ సిస్టమ్ ఉందని, ఇది 'భారతదేశానికి మైలురాయి' అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు.

NavIC కేవలం ఐఫోన్ సిరీస్ మొబైల్స్‌కి మాత్రమే కాకుండా రియల్‌మీ 9 ప్రో, వన్ ప్లస్ నార్డ్ 2టీ, షియోమీ ఎమ్ఐ 11ఎక్స్ వంటి వాటిలో కూడా లభిస్తుంది. కావున వినియోగదారులు దీంతో ఉత్తమ్ లొకేషన్ ట్రాకింగ్ అనుభవాన్ని పొందవచ్చు. జీపీఎస్ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement