ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు | Sakshi
Sakshi News home page

WWDC 2024: ఆశ్చర్యపోయాను!.. భారతీయ విద్యార్థిపై 'టిమ్ కుక్' ప్రశంసలు

Published Mon, Jun 10 2024 4:14 PM

Apple CEO Tim Cook Meets Indian Student Developer Akshat Srivastava

యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్‌ ప్రారంభం కావడానికి ముందు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్న 22 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవను కుక్ కలిశారు.

టిమ్ కుక్.. భారతీయ విద్యార్థి, డెవలపర్‌ అయిన అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన పరస్పర చర్యను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌'లో గెలిచిన విద్యార్థి డెవలపర్‌లతో మాట్లాడాను. వారి క్రియేటివిటీ, ప్రదర్శనను చూడటం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు.

నేను గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు చాలా మంది గొప్ప డెవలపర్‌లను కలిశాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచే అనేక మార్గాలు వారిలో ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ వారం అక్షత్‌ని కలవడం కూడా అంతే ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ గేమ్‌ల పట్ల తనకున్న ప్రేమను తరువాత తరంతో పంచుకోవడానికి సరికొత్త మార్గాన్ని సృష్టించారు అని వెల్లడించారు.

శ్రీవాస్తవ యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో భాగంగా మైండ్‌బడ్ అనే యాప్‌ను సమర్పించారు. ఇది తన మేనల్లుడితో పంచుకున్న ఉల్లాసభరితమైన క్షణాల నుంచి ప్రేరణ పొంది, ఈ యాప్‌ను రూపొందించినట్లు సమాచారం. మైండ్‌బడ్ పిల్లలు తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందించడానికి రూపొందించిన నాలుగు ఆకర్షణీయమైన చిన్న గేమ్‌లను కలిగి ఉంది.

శ్రీవాస్తవ మైండ్‌బడ్‌ని సృష్టించడానికి స్విఫ్ట్‌యుఐ, ఎవికిట్ (ఆడియో), పెన్సిల్‌కిట్, ఫైల్‌మేనేజర్‌లను ఉపయోగించారు. కొత్త టెక్నాలజీలు అనుగుణంగా దీనిని రూపొందించారు.

అక్షత్ శ్రీవాస్తవ కోవిడ్ సంక్షోభ సమయంలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోని సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న పడకలను ట్రాక్ చేయడానికి ఒక యాప్‌ను అభివృద్ధి చేశారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీల మీద ఆసక్తి కనపరిచిన శ్రీవాస్తవ యాపిల్ పార్క్‌లో జరిగే కార్యక్రమానికి 50 మంది విద్యార్థులలో ఒకరుగా వెళ్లారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement