ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ | Anand Mahindra Tweet About World Highest Railway Bridge | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిపై మొదటి రైలు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

Published Fri, Jun 21 2024 7:46 PM | Last Updated on Fri, Jun 21 2024 8:24 PM

Anand Mahindra Tweet About World Highest Railway Bridge

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను దాటిన మొదటి రైలు అంటూ ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా వీడియో షేర్ చేస్తూ.. ఇది యోగా దినోత్సవం కాబట్టి, మన మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు ఆకాశం వైపు విస్తరించి ఉన్నాయని సూచించడానికి ఇది సరైన చిత్రం అని ట్వీట్ చేశారు.

ఎత్తైన రైల్వే బ్రిడ్జ్
భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బిడ్జ్ నిర్మాణం పూర్తయింది. దీనిపైన రైలు బోగీల ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే ఈ బిడ్జి మీద రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ బిడ్జిని ఇప్పటికే ఇంజినీర్లు, రైల్వే అధికారులు పరీక్షించారు. ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించారు.

చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1315 మీటర్లు. ఈ బ్రిడ్జి ద్వారా రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసీ మధ్య రైల్వే సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత ఎత్తైన బ్రిడ్జి ఎక్కడా లేదు. కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిగా ఇది సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement