Viral Video:ఆనంద్‌ మహీంద్రా మరో సూపర్‌ వీడియో, నెటిజన్లు ఫిదా | Anand Mahindra shared another video users says wow | Sakshi
Sakshi News home page

Viral Video:ఆనంద్‌ మహీంద్రా మరో సూపర్‌ వీడియో, నెటిజన్లు ఫిదా

Jul 28 2022 1:40 PM | Updated on Jul 28 2022 2:06 PM

Anand Mahindra shared another video users says wow - Sakshi

సాక్షి, ముంబై:  ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఎపుడూ యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఇన్నోవేటివ్‌ కథనాలను, వీడియోలను పంచుకునే ఎంఅండ్‌ ఎం అధినేత ఆనంద్‌ మహీంద్ర తాజాగా ట్విటర్‌లో పంచుకున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో నిండిపోయిన మన యుగంలో ఇదొక అద్భుతమైంది. అందమైంది. ఈ 'ప్రిమిటివ్' మెకానికల్ డివైస్ అద్బుతంగా, అందంగా ఉంది. సస్టైనబుల్‌, సమర్ధవంతమైంది మాత్రమే కాదు. కదులుతున్న శిల్పంలా ఉంది అంటూ ఆయన కమెంట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. లైక్‌లు,కమెంట్లు వెల్లువలా వస్తున్నాయి. 

దీంతో వావ్‌.. వండర్‌ ఫుల్‌ అంటూ నెటిజన్లు కమెంట్‌ చేశారు. గ్రామాల్లో  పొలాల్లోని నీటిని తోడే యంత్రంలాగా, మరోవైపు  ఆహార ధాన్యాలను దంచుకునే దంపుడు సాధనం లాగా, పక్కనే నీటి ద్వారా విద్యుత్తును తయారు చేసేందుకుపయోగించేలా ఉన్న ఈ  టెక్నిక్‌ చూసి యూజర్లు ఫిదా అవుతున్నారు. ‘‘నాకు డిజైనింగ్‌లో పెద్దగా నైపుణ్యం లేదు.. కానీ ఇది మాత్రం సూపర్‌ అని చెప్పగలను సార్‌. బరువు, మోషన్‌ కంట్రోలింగ్‌లో చాలా నైపుణ్యం ఉంది ఇందులో. అంతేకాదు  ఈ వీడియోలోని మహిళఫోకస్‌, ప్లో మెచ్చుకోదగింది అని మరో యూజర్‌ వ్యాఖ్యానించారు.

వావ్‌.. పొలాల్లోకి నీటిని పంప్ చేయడానికి ఉపయోగించే చాలా పురాతనమైన పద్దతి ఇది. నా బాల్యాన్ని గుర్తుచేశారు. థ్యాంక్యూ సర్‌. ఇది చూసినందుకు సంతోషంగా ఉందని మరొకరు కమెంట్‌ చేశారు. అంతేకాదు  ఎన్ని రకాలుగా ఉపయోగపడుతోంది ఈ డివైస్‌. ఒకవైపు  హైడ్రాలిక్‌ పవర్‌, మరోవైపు వాటర్‌ పంపింగ్‌.. అలాగే మహిళ ఒడ్లు లాంటివేవో దంచుతోంది. ఈ టెక్నాలజీ అదిరిపోయిందంటూ అబ్బురపడు తున్నారు.  అద్భుతమంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement