క్యాప్షన్ కాంపిటీషన్‌లో విన్నర్: ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ ఏంటో తెలుసా? | Anand Mahindra Announces Winner Of Caption Contest | Sakshi
Sakshi News home page

క్యాప్షన్ కాంపిటీషన్‌లో విన్నర్: ఆనంద్ మహీంద్రా గిఫ్ట్ ఏంటో తెలుసా?

Published Sat, Jun 8 2024 11:23 AM | Last Updated on Sat, Jun 8 2024 11:53 AM

Anand Mahindra Announces Winner Of Caption Contest

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా మరో ఫోటోను షేర్ చేస్తూ.. ఓ ఫన్నీ కాంపిటీషన్ నిరవహించారు. గెలిచినవారికి గిఫ్ట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటోను గమనిస్తే..  ఇనుప రెయిలింగ్ వెనుక కూర్చున్న ఓ కుక్క తన మొహాన్ని కరెక్ట్‌గా ఓ ఆకృతి దగ్గర పెట్టింది. దీనికి ఓ సరదా కామెంట్ చేయాలనీ, దాని కోసం జులై 3 వరకు గడువు ఇచ్చారు. గెలిచినవారికి ఓ బొమ్మ మహీంద్రా ఫ్యూరియో ప్రకటించారు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఫోటో మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ఇందులో ఒకరు ఫోటో మీద కామెంట్ చేస్తూ.. అది ఇన్‌కాగ్నిటో మోడ్ మాదిరిగా ఉందని పేర్కొన్నారు. ఈ సమాధానం ఆనంద్ మహీంద్రాకు తెగ నచ్చేసింది. దీంతో వారి అడ్రస్ మెయిల్ చేస్తే గిఫ్ట్ పంపిస్తా అంటూ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement